ఇటీవల కాలంలో గుంటూరు పేరు ఎక్కువగా మీడియాలో , పేపర్లలో వినబడుతుంది. గుంటూరు లో మరొ కొత్త నిజం బయటికి వచ్చింది. మొన్న సెక్స్ కుంభకోణం .. తారా.. నిన్న సెక్స్ రాకేట్ .. శ్రీదేవిల విషయం మరిచిపోకముందే. మరో పచ్చి నిజం బయట పడింది. ప్రభుత్వ అధికారి అయి ఉండి . ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండే గుంటూరు అర్భన్ ఎస్సీ పై తన భార్యను లోపరుచుకున్నాడు అనే వార్త హాట్ హాట్ గుంటూరులో పేలింది.
తన భార్యతో సంబంధం ఉండటం వల్లనే తన కేసులో గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఓ భర్త రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఆధారాలు సమర్పించినట్లు పెద్ద ఎత్తున వార్తా ఛానెళ్లలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. విషయానికి వస్తే గుంటూరు జిల్లాకు చెందిన అర్బన్ ఎస్పీ మహిళకు తరుచూ ఫోన్లు చేస్తున్నారనే వివాదంలో కూరుకు పోయారు. కార్తీక్, గోపి ప్రియ 1999లో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.
ఆ తర్వాత భార్య గోపిప్రియ భర్త కార్తీక్ పైన వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత కార్తీక్ తనకు విడాకులు కావాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ దంపతుల కేసులో గుంటూరు జిల్లాకు చెందిన అర్బన్ ఎస్పీ శ్యాంసుందర్ ఓవరాక్షన్ చేశారని భర్త కార్తీక్ ఆరోపిస్తున్నారు. తన భార్య గోపిప్రియ తో సంబంధం ఉండటం వల్లనే ఆయన ఈ కేసులో ప్రత్యక శ్రద్ధ చూపిస్తున్నారని భర్త ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలను కార్తీక్ హైకోర్టులో సమర్పించాడు. జనవరి 2వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు గోపి ప్రియకు ఎస్పీ నుండి 221 ఫోన్ కాల్స్ వెళ్లాయి. అలాగే గోపి ప్రియ నుంచి ఎస్పీకి 175 కాల్స్ వచ్చాయి. తన భార్యతో సంబంధం కారణంగా ఎస్పీ ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని, అతని పరిధి నుంచి 498ఏ కేసు తప్పించాలని భర్త హైకోర్టును కోరారు.
అర్ధరాత్రి ఎస్పీ తన భార్యకు ఫోన్ చేయడంపై భర్త కార్తీక్ విస్మయం వ్యక్తం చేశారు. గంటల కొద్ది మాట్లాడారని ఆయన కోర్టుకు విన్నవించారు. కేసులో భాగంగా ఇన్నిసార్లు ఫోన్ చేసి, అర్ధరాత్రి, అపరాత్రి ఫోన్లు చేయడం ఏ కేసులో భాగమని కార్తీక్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ పూర్తి ఆధారాలను కోర్టుకు భర్త సమర్పించారు. తనను నిత్యం విచారణ పేరిట పిలిపించి వేధిస్తున్నారని భర్త ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయంపై ఎస్పీ ఇంకా స్పందించలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more