Tara chowdary used ysr

Tara Chowdary Used YSR

Tara Chowdary Used YSR

YSR.gif

Posted: 04/13/2012 01:30 PM IST
Tara chowdary used ysr

తెనాలికి చెందిన కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్‌రావు ద్వారా తాను వైఎస్ రాజశేఖర్‌డ్డిని కలిసినట్టు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తారాచౌదరి చెప్పింది. వైఎస్‌తో ఫొటో దిగానని తెలిపింది. ఆ తరువాత ఆ ఫొటో చూపించి వైఎస్ రాజశేఖర్‌డ్డితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పి పలువురిని బెదిరించి డబ్బు వసూలు చేసినట్టుగా వెల్లడించింది.బెయిల్‌పై నిర్ణయం నేడు: తారాచౌదరి తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్లపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ విశాఖపట్టణానికి చెందిన ఓ యువతిని తారాచౌదరి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఆశపెట్టి హైదరాబాద్‌కు పిలిపించుకుందని చెప్పారు. ఆ తరువాత ఆమెను వ్యభిచార రొంపిలోకి దింపిందన్నారు. తారాచౌదరి సహచరుడు దుర్గావూపసాద్ ఆ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు చెప్పారు. తారాచౌదరి బాధితురాళ్లు మరింతమంది ఉన్నారన్నారు. కస్టడీలో ఉన్న సమయంలో బెయిల్ వచ్చాక మీ అందరి అంతు చూస్తానంటూ తారాచౌదరి పోలీసులనే బెదిరించిందని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే తారాచౌదరిపై ఫిర్యాదు చేసిన బాధితురాలి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఆమె ఉచ్చులో చిక్కిన మరికొందరు యువతులు కూడా ఇబ్బందిపడే అవకాశాలున్నాయన్నారు.

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తారాచౌదరికి బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. కాగా, తన కేసులు వాదించలేదని న్యాయవాది చెంచురామయ్యపై దాడి చేసిన కేసు (సెక్షన్ ఐపీసీ 21), పోలీసుల విధి నిర్వహణను అడ్డుకుందంటూ నమోదు చేసిన కేసు (సెక్షన్ 12)లో కోర్టు తారాచౌదరికి బెయిల్ మంజూరు చేసింది. అయిదువేల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులను కోర్టుకు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, అమాయక యువతులను వ్యభిచార కూపంలోకి దింపిందన్న నేరారోపణల మీద ఐపీసీ సెక్షన్ 33 ప్రకారం నమోదైన కేసులో మాత్రం తారాచౌదరికి బెయిల్ లభించలేదు. దీనిపై తుది ఉత్తర్వులను మెజిస్ట్రేట్ వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Guntur urban superintendent shyam sundar is facing a writ petition in the high court
T subbarami reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles