Sonipat teacher killed for not allowing cheating

Sonipat teacher killed for not allowing cheating,Sonipat town killed, Hindi teacher at Ramjas School in Haryana killed, teacher killed in Haryana for not allowing cheating,Sonepat district, examination, Vikram Singh, nation news

Sonipat teacher killed for not allowing cheating

teacher.gif

Posted: 04/10/2012 06:40 PM IST
Sonipat teacher killed for not allowing cheating

Sonipat teacher killed for not allowing cheating

తమ స్నేహితుడు పరీక్షలో కాపీ కొడుతుంటే పట్టుకున్న ఉపాధ్యాయుడిపై పగ పట్టిన ఇద్దరు కుర్రాళ్లు.. ఆ టీచర్ని కారుతో గుద్ది చంపేశారు. హర్యానా ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలో విద్యార్థిని కాపీకొట్టడానికి అంగీకరించలేదన్న కక్షతో ఒక ఉపాద్యాయుడిని ఆ విద్యార్థి స్నేహితులుగా భావిస్తున్న ఇద్దరు దుండగులు హత్య చేశారు. ఈ ఘటన జరుగగా, ఈ దురాగతానికి పాల్పడిన ఇద్దరిలో ఒకడైన విక్రమ్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా మరొక నిందితుడు హరి ఓం పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోనెపట్‌లో ఉన్న రామ్‌జాస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో హిందీని బోధిస్తున్న 37 ఏళ్ళ రాకేష్‌ కుమార్‌ అనే ఉపాద్యాయుడు ఒక పరీక్ష కేంద్రంలో విదులను ముగించుకొని కాలినడకన ఇంటికి వస్తున్న సమయంలో విక్రమ్‌సింగ్‌, హరిఓం అనే వ్యక్తులు రాకేష్‌ను అటకాయించారు.

పరీక్షలో తమ స్నేహితుడైన ఒక విద్యార్థిని కాపీ కొట్టడానికి అనుమతించాలని రాకేష్‌ను బలవంతపెట్టారు. అయితే రాకేష్‌ నిరాకరించటంతో నిందితులిద్దరు ఆ రోజు సాయంత్రం రాకేశ్ ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చి ఆయన్ని అడ్డగించారు. కొద్దిసేపు రాకేశ్‌తో వాదించి.. అనంతరం కారుని ఆయన మీదుగా పోనిచ్చారు. తీవ్రగాయాలతో ఆయన కిందపడిపోగా.. విచక్షణారహితంగా మరోసారి కారును రివర్స్‌చేసి ఆయన మీదకు ఎక్కించారు.

విక్రం, హరిఓం.. రాకేశ్‌ను అడ్డగించి వాదిస్తున్నప్పుడు ఆయన తండ్రి, సోదరులు ఇద్దరూ అక్కడే ఉన్నారు. నిందితులను రాకేశ్ సోదరుడు ముఖేశ్ గుర్తించారు. "అప్పుడు కారును విక్రం నడుపుతున్నాడు. వాళ్లిద్దరూ కావాలనే నా సోదరుడిమీదుగా కారును పోనిచ్చారు. రెండోసారి కారును రివర్స్ చేసి మరీ తొక్కించారు'' అని ముఖేశ్ జరిగిన ఘాతుకాన్ని వివరించారు. కాగా తీవ్రగాయాలపాలైన రాకేష్‌ను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకుపోయినప్పటికి కూడా ఫలితం లేకపోయింది. కాగా రాకేష్‌, తన మరణ వాంగ్మూలంలో హంతకులను గుర్తించినట్లు పోలీసులకు తెలిపారు. పారిపోయిన మరో హంతకుడు హరి ఓంను కూడా తొందరలోనే పట్టుకుంటామని సోనెపట్‌ డీఎస్పీ సురేందర్‌ మాలిక్‌ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys rajasekhar reddy may also likely to sent jail
Babu mohan vs varla ramaiah  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles