Knee pain tica

knee pain tica

knee pain tica

knee.gif

Posted: 04/09/2012 01:46 PM IST
Knee pain tica

Knee-Pain

కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారికి ఇది శుభవార్త. కొత్తగా గుర్తించిన కార్టోజెనిన్ అణువు ఈ నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. కీళ్లనొప్పులకు ఇప్పటివరకూ చికిత్స లేకపోగా కేవలం పెయిన్ కిల్లర్లతో నొప్పిని నియంత్రించడం మాత్రమే వీలయ్యేది. ఈ నేపథ్యంలో శాండియాగోలోని జినోమిక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నోవార్టిస్ రీసెర్చ్ ఫౌండేషన్, కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లు సంయుక్తంగా జరిపిన పరిశోధనల కారణంగా మూలకణాలతో కీళ్లనొప్పులకు చికిత్స కల్పించడం సాధ్యమేనని తేలింది. దాదాపు 22 వేల రసాయనాలను రోబోల సాయంతో విశ్లేషించినప్పుడు కార్టొజెనిన్ ప్రభావం గురించి తెలిసింది. ఎముక మజ్జ తాలూకూ మూలకణాలకు కార్టొజెనిన్‌ను అందించినప్పుడు అవి కాస్తా మృదులాస్థి కణజాలంగా మారడం మొదలైంది. కీళ్ల మధ్యలో ఉండే కణజాలం అరిగిపోయినప్పుడే నొప్పి, బిగుసుకుపోవడం, కదలికలకు ఇబ్బంది వస్తుందన్నది తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Denmark the happiest place on earth
Minister dharmana prasada rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles