ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న కేన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఓ సార్వత్రిక కేన్సర్ టీకాను తయారుచేసినట్లు ‘టెల్ అవైవ్ యూనివర్సిటీ’ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అన్ని కేన్సర్లకు ఒకే టీకా! కేన్సర్ రోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తూ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. యూనివర్సల్ కేన్సర్ వేక్సిన్గా పిలుస్తున్న ఈ మందు పేరు 'ఇమ్యుసిన్'. కేన్సర్ కణాలను తుదముట్టించడానికి కొత్త మార్గాన్ని ఎంచుకోవడమే దీని ప్రత్యేకత. ట్యూమర్లతో సమర్థంగా పోరాడే విధంగా రోగుల శరీరానికి ఈ మందు తగిన తర్ఫీదు ఇస్తుంది! ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వాక్సిల్ బయోథెరాపుటిక్స్ అనే మందుల కంపెనీ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి పరిచాయి.
90శాతం కేన్సర్లలో ఉండే ఒకేరకమైన అణువును లక్ష్యంగా చేసుకుని 'ఇమ్యుసిన్' పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూనివర్సల్ ఇంజెక్షన్‌ను త్వరలోనే అందుబాటులోకి తేవడానికి తమ పరిశోధన కొత్త మార్గం చూపిందని పేర్కొన్నారు. ఇది రొమ్ము, ప్రొస్టేట్ సహా సాధారణ కేన్సర్లతో పోరాడేలా రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వివరించారు. ఇప్పటికే దీనిపై జరిగిన ప్రాథమిక పరిశోధనల్లో ఈ దిశగా సత్ఫలితాలు వ చ్చాయని వెల్లడించారు. ఇప్పటికే చికిత్స తీసుకున్న వారిలో మరోసారి కేన్సర్ కణతులు రాకుండా కూడా ఇది నిరోధిస్తుందన్నారు. దీనిపై విస్తృత పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు సమాయత్తమవుతున్నారు.
"రోగ నిరోధక వ్యవస్థ నుంచి సాధారణంగా కేన్సర్ కణాలు తప్పించుకుంటాయి. ఎందుకంటే శరీర కణజాలంతోనే ట్యూమర్లు తయారవుతాయి కాబట్టి రోగ నిరోధక వ్యవస్థ వాటిని ప్రమాదకారిగా గుర్తించదు. అయితే కేన్సర్ కణాలపై పెద్దమొత్తంలో ఉండే 'ఎంయూసీ1' అనే అణువుల సాయంతో ట్యూమర్లను రోగ నిరోధక వ్యవస్థ గుర్తించే విధంగా చేయవచ్చు. అదే అణువును ఉపయోగించి కేన్సర్ కణాలను నిర్మూలించేలా రోగ నిరోధక వ్యవస్థను 'ఇమ్యుసిన్' మార్చుతుంది'' అని పరిశోధకులు వివరించారు.
రెండు నుంచి నాలుగు డోసులు వేయగానే రోగ నిరోధక వ్యవస్థలో 'ఇమ్యుసిన్' ప్రత్యేక మార్పు తీసుకువచ్చినట్లు రోగులపై జరిపిన ప్రయోగంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో భాగంగా జెరూసలెంలోని ఓ మెడికల్ సెంటర్లో పది మంది రక్త కేన్సర్ రోగులపై 'ఇమ్యుసిన్' ప్రయోగించారు. వారిలో పూర్తి స్థాయి చికిత్స తీసుకున్న ఏడుగురు రోగుల్లో కేన్సర్‌ను ఎదురించే విధంగా రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని, ముగ్గురిలో కేన్సర్ కణాలు పూర్తిగా నశించాయని వాక్సిల్ సంస్థ ప్రకటించింది. దీనిపై మరింత అధ్యయనం తర్వాతే ఈ ఫలితాలుఅధికారికంగా విడుదలకానున్నాయి. ఆ ప్రయోగాలు కూడా విజయవంతమైతే ఆరేళ్లలో 'ఇమ్యుసిన్' అందుబాటులోకి రావచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more