Tara chowdary interrogation in a full swing by police

tara chowdary interrogation in a full swing by police

tara chowdary interrogation in a full swing by police

8.gif

Posted: 04/08/2012 02:10 PM IST
Tara chowdary interrogation in a full swing by police

            tara_inn సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయిన తారా చౌదరిని పోలీసులు ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారట. ఆమె విచారణకు కోర్టు ఇచ్చిన నాలుగు రోజుల సమయాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారని సమాచారం. ప్రశ్నల పరంపరతో ఈ కేసు పూర్వాపరాలు తెలుసుకునేందుకు వారు తీవ్రంగా యత్నిస్తున్నారు. 
              కాగా, నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసందే. సంచలనం సృష్టించిన సెక్స్ రాకెట్ కేసులో తారా చౌదరిని వారం రోజుల పాటు విచారించేందుకు వీలుగా తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు నిన్న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి న్యాయస్థానం ఈ నెల 11వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
            మార్చి నెల 31వ తేదీన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో శ్రీనగర్ కాలనీలో తారా చౌదరి అరెస్టయిన సంగతి విదితమే. ఆమెను ఆ మర్నాడు కోర్టులో హాజరుపరచగా, చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. తారా చౌదరి ప్రకాశం జిల్లాకు చెందిన మహిళని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటోందని పోలీసులు కోర్టుకు తెలిపారు. రెండు రోజుల క్రితం తారా చౌదరి ఇంటిపై పోలీసులు దాడులు జరిపి ఒక స్పై కెమెరా, ఇరవై సిమ్‌కార్డులు, ఎనిమిది మెమరీ కార్డులు, ఏడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌తో పాటు పలు సిడీలను స్వాధీనం చేసుకున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan president jardari visit bharat
Telangana agitations again day after tomarrow onwards kodandaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles