భారతదేశ వారెన్ బఫెట్‌గా పిలుచుకునే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌ర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రాష్ట్ర కంపెనీలపై ఉన్న మోజును మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన రాకేశ్ తన వాటాలను మరింత పెంచుకుంటున్నారు. తాజాగా వైస్రాయ్ హోటల్స్‌లో ఒకేసారి ఏకమొత్తంగా 14.57 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. దీంతో వైస్రాయ్ హోటల్లో ఝున్‌ఝున్‌వాలా వాటా 11.2 శాతం నుంచి 14.7 శాతానికి చేరుకుంది. 32.25 శాతం వాటా కలిగివున్న ప్రమోటర్ల తర్వాత రాకేశ్‌దే అత్యధిక వాటా కావడం విశేషం. ఒకపక్క ఐవీఆర్‌సీఎల్‌లో జీగ్రూపు అధినేత సుభాష్ చంద్ర ఐవీఆర్‌సీఎల్‌లో వాటా పెంచుకుంటున్న తరుణంలోనే ఝున్‌ఝున్‌వాలా కూడా వైస్రాయ్ హోటల్స్‌లో వాటా పెంచుకోవడంపై ఆసక్తి నెలకొంది.
రాష్ట్రానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఝున్‌ఝున్‌వాలా ప్రత్యేక ఆసక్తిని చూపిస్తారు. స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీల కంటే ఎక్స్చేంజీల్లో నమోదు కాని అనేక కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి రాకేశ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ మధ్య ఒక సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ ‘ నాకు ఆంధ్రాపై ప్రత్యేక అభిమానం ఉందని, అందుకే ఇక్కడ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నా’ అని అన్నారు. స్టాక్ మార్కెట్లో నమోదు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వలన ఆ కంపెనీల పేర్లను చెప్పడానికి ఆయన నిరాకరించారు. కాని ఆయన రాష్ట్రానికి చెందిన ప్రముఖ విత్తన కంపెనీ, బయోటెక్నాలజీ, కొత్తగా వస్తున్న భారీ విద్యుత్ ప్రాజెక్టు, హాస్పిటల్స్, నిర్మాణరంగానికి చెందిన పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. ఈ మధ్యనే కేర్ హాస్పిటల్స్‌లో తన వాటాను భారీ లాభాలకు విక్రయించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు స్టాక్ మార్కెట్ ద్వారా రాష్ట్ర కంపెనీలైన నాగార్జునా కనస్ట్రక్షన్, వైస్రాయ్‌ల్లో రాకేష్ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. జనవరి 15 నాటికి ఎన్‌సీసీలో రాకేష్ 1.49 కోట్ల షేర్లను (కంపెనీలో 5.85 శాతం వాటా) కలిగివున్నారు. రాష్ట్రానికి చెందిన ప్రమోటర్ల కంపెనీ జెన్ టెక్నాలజీస్‌తోపాటు, అల్ఫాజియోలో కూడా రాకేశ్‌కు వాటాలున్నాయి.
రేటింగ్ కంపెనీ క్రిసిల్, వాచీలు, బంగారు ఆభరణాలు విక్రయించే టైటాన్, జెనెరిక్ ఔషధ తయారీ కంపెనీ లుపిన్ ఫార్మా, సాఫ్ట్‌వేర్ కంపెనీ జామెట్రిక్, చక్కెర ఉత్పాదక, యంత్రాల తయారీ కంపెనీ ప్రజ్ ఇండస్ట్రీస్, లగేజ్ కంపెనీ వీఐపీ, గేమింగ్ కంపెనీ డెల్టా కార్పొరేషన్ తదితర కంపెనీల్లో రాకే శ్‌కు భారీ పెట్టుబడులు వున్నాయి. కరూర్ వైశ్యా బ్యాంక్, డీసీబీ తదితర ప్రైవేటు బ్యాంకుల్లో కూడా ఆయన పెట్టుబడి చేసారు. ఒక కంపెనీని పూర్తిగా టేకోవర్ చేసి దానిపై పూర్తి నియంత్రణ సాధించాలనే దానికంటే కేవలం పెట్టుబడిదారుడిగా ఉండటానికే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇష్టపడతారు. ఒక కంపెనీని నిర్వహించడం ఎంత కష్టమో ఆప్టెక్ కంప్యూటర్స్‌తో తెలిసొచ్చింది. మొదట ఇన్వెస్టర్‌గా ప్రారంభించి మొత్తం కంపెనీని సొంత చేసుకున్న రాకేష్ ఇప్పుడు దానిని నిర్వహించలేక అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో సరైన ధరల లభించడం లేదు. ప్రస్తుతం ఆప్టెక్ మార్కెట్ క్యాప్ రూ.398 కోట్లు కాగా, దాన్ని రూ.700 కోట్లకు విక్రయించాలని రాకేష్ బిడ్డింగ్‌కు పిలిచారు. ఇన్వెస్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more