Sri seetharamula kalyanam

Sri, Seetharamula, Kalyanam, Videos, Bhadrachalam, sri, seetharamula, kalyanam, seetharamula, kalyanam, 2011, seetharamula, kalyanam, bhadrachalam

Sri, Seetharamula, Kalyanam, Videos, Bhadrachalam, sri, seetharamula, kalyanam, seetharamula, kalyanam, 2011, seetharamula, kalyanam, bhadrachalam

Sri Seetharamula Kalyanam.GIF

Posted: 03/31/2012 12:22 PM IST
Sri seetharamula kalyanam

Seeta-rama-kalyanamభద్రాద్రిలో రేపు జరిగే శ్రీరామనవమి ఉత్సవం కోసం ఏర్పాట్లు జోరందుకున్నాయి. రాములోరి పెళ్లి ఘడియలు దగ్గర పడుతుండటంతో ముత్యాల తలంబ్రాలు, లడ్డూల తయారీ ఊపందుకుంది. చిత్రకూట మండపంలో భారీ ఎత్తున లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తున్నారు.

భద్రాద్రి సీతారామ కళ్యాణం అనగానే ముందుగా గుర్తొచ్చేది ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలే. ఈ సారి నవమి భక్తుల కోసం లక్షన్నరకు పైగా లడ్డూలు, లక్ష తలంబ్రాల పొట్లాలు సిద్దం చేస్తున్నారు. 50క్వింటాళ్ల అక్షింతలను తయారు చేసిన పూజారులు వాటిని చిన్నచిన్న పొట్లాలుగా కడుతున్నారు. ఇందులో ముత్యాలు లేని పొట్లాలు 50వేలు, మూడు ముత్యాలు వేసిన ప్యాకేట్లు 10వేలు, ఒక ముత్యం వేసి 25వేల పొట్లాలు కడుతున్నారు. సీతారాముల కళ్యాణ సమయంలో వీటిని భక్తులకు అందచేస్తారు. అతిపవిత్రంగా భావించే ఈ తలంబ్రాలను ఇళ్లల్లో జరిగే శుభకార్యాల సమయంలో ఉపయోగిస్తారు.

ఇక భక్తులు పవిత్రంగా భావించే భద్రాద్రి లడ్డూప్రసాదాలను భారీ ఎత్తున తయారు చేస్తున్నారు. ఈసారి లక్షా 50వేల లడ్డూలు మాత్రమే తయారు చేయాలని నిర్ణయించారు. గతఏడాది 3లక్షల లడ్డూలు తయారు చేస్తే 2లక్షల లడ్డూలే అమ్ముడుపోయాయని అధికారులు తెలిపారు. శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం సందర్భంగా లక్షన్నర లడ్డూలు భక్తులకు విక్రయించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress party join on allu
Ranjitha defamed case against sun tv  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles