ఒక సినిమాను సినిమాగా ఆస్వాదించండి. తెర వెనుక నడిచేవి నడుస్తూనే ఉంటాయి. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం అంటున్నారు సైఫ్ అలీ ఖాన్. అలాగే తెర వెనుక ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యవహారం ముఖ్యమైందిగా కావటం పెద్ద సమస్యగా మారింది. దాంతో ప్రేక్షకుల అంచనాలు మారిపోతాయి. అది సినిమా ఉద్దేశాన్ని మింగేస్తుంది అని సైఫ్ వాపోయాడు. బాలీవుడ్ ప్రేమికుల జంట సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ 'ఏజెంట్ వినోద్' చిత్రానికి కలిసి నటించారు. నిజజీవితంలో ప్రేమికులు తెరపై కూడా అదే పాత్రల్లో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో సహజంగానే ఆ చిత్రంపై ఒక విధమైన ఆసక్తి ఏర్పడింది. అయితే అలాంటి అంచనా వద్దని సైఫ్ అలీఖాన్ అంటున్నాడు.
అలాగే నిజజీవితంలో ప్రేమికులను తెరపై చూడటం కోసం సినిమాకు రాకూడదు. తెరపై ఇద్దరు నటులను చూడాలనే ఉద్దేశంతో ప్రేక్షకులు సినిమా హాల్లోకి అడుగుపెట్టాలి. 'ఏజెంట్ వినోద్' చిత్రాన్ని ఒక దర్శకుడు మనసు పెట్టి తీసిన సినిమాగా చూడండి అని చెప్పారు. 'ఏజెంట్ వినోద్' సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న మూడవ చిత్రం. గతంలో ఆదిత్య చోప్రా నిర్మించిన 'తషాన్', కరణ్ జోహార్ రూపొందించిన 'కుర్బాన్' చిత్రాల్లో వారిద్దరూ జంటగా నటించారు. యాక్షన్ స్పై చిత్రం 'ఏజెంట్ వినోద్' ద్వారా జంటగా ప్రేక్షకులను మైమరిపించేందుకు వస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more