Pcc chief botsa resign

PCC chief Botsa on by poll results. sonia, chiranjeevi, ysr, botsa, kiran kumar reddy, undavalli, geetha reddy, sailaja nadh, hanumanth rao, kk, sabbam hari, rosaiah, tsr, congress discipline

PCC chief Botsa on by poll results. sonia, chiranjeevi, ysr, botsa, kiran kumar reddy, undavalli, geetha reddy, sailaja nadh, hanumanth rao, kk, sabbam hari, rosaiah, tsr, congress discipline

PCC chief Botsa resign.gif

Posted: 03/22/2012 04:22 PM IST
Pcc chief botsa resign

Botsaవెంకి పెళ్ళి – సుబ్బు చావుకు రావడం అంటే ఇదే. తెలంగాణ లో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీటుకు ఎసరు తెచ్చేటట్లు కనబడుతుంది. తెలంగాణలో ఓటమికి బాధ్యత వహిస్తూ సత్తిబాబు రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు. దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే పార్టీలో తన ఇమేజ్‌ పెంచుకోవడంతో పాటు, ముందుగానే రాజీనామా చేయడం ద్వారా అటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డినీ ఇరుకున పెట్టాలన్న వ్యూహంతో దీనికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా రాజీనామాకు ఇంకో కారణం కూడా ఉందని తెలుస్తుంది.

పీపీసీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి స్పీడు పెంచిన బొత్స కాంగ్రెస్ లో అన్నీ తానై నడిపిస్తున్నాడు. అయితే కోవూరులో జరిగిన ఉప ఎన్నిక కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసిన బొత్స అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో కలత చెంది రాజీనామా చేసే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది. నేడో, రేపో దీనిపై నిర్ణయం ప్రకటించవచ్చని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలలో పార్టీ ఓడిపోయినా తాను పదవిని పట్టుకుని వేళ్లాడుతున్నానన్న విమర్శలు రావడం మంచిదికాదని, దానికంటే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయటం వల్ల అటు క్యాడర్‌లో ఇమేజ్‌ పెరగడంతో పాటు, అధిష్ఠానం వద్ద తన విలువ కూడా పెరుగుతుందని బొత్స అంచనా వేస్తున్నారు. తాను రాజీనామా చేయటం ద్వారా కిరణ్‌ కూడా తప్పని సరిగా రాజీనామా చేయవలసి వస్తుందని, ఆ తర్వాత తాను సీఎం పదవిని సులభంగా చేజిక్కించుకోవచ్చని సత్తిబాబు అంచనా వేస్తున్నట్లు గాంధీభవన్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇప్పటికే బొత్స పై కాంగ్రెస్ వాళ్ళు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారందరి చేత మాటలు పడేకంటే రాజీనామా చేస్తేనే బాగుంటుందని బొత్స సత్తిబాబు అనుకుంటున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Commissioner kneelakanta reddy
Good news for american visa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles