Tdp cm ramesh gets nomination for rs

TDP has finalized the name of C M Ramesh, a wealthy businessman and close associate of the party chief N Chandrababu Naidu for one of the two Rajya Sabha seats it is likely to win of the six falling vacant from the State.

CM Ramesh gets nomination for RS.gif

Posted: 03/17/2012 09:38 AM IST
Tdp cm ramesh gets nomination for rs

తెలుగుదేశం పార్టీకి రానున్న రెండు రాజ్యసభ సీట్లలో దాదాపు ఒక సీటు ఖరారు అయినట్లు తెలుస్తుంది. చంద్రబాబుకు రైట్ హ్యాండ్, పెట్టుబడి దారిగా ఉండే సీఎం రమేష్ కి సీటు ఖరారయినట్లు వార్తలు వస్తున్నాయి. స్వతహాగా పారిశ్రామిక వేత్త అయిన రమేష్ కడప జిల్లాకు చెందిన వాడు. ఇతడు చాలా కాలంగా టీడీపీని, చంద్రబాబును అంటిపెట్టుకొని ఉన్న వ్యక్తి. ఇప్పటి వరకు ఇతనికి టిక్కెట్ ఇచ్చి పోటీ చేసిన ధాఖలాలు లేవు. పార్టీకి అండగా ఉండే వ్యక్తి, రాయలసీమ వాడు కాడం, ప్రస్తుతం అదే ప్రాంతానికి చెందిన ఎం.వి.మైసూరారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా, పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన రమేశ్‌కు పార్టీ అధినేత చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

మొన్నటి వరకు సీమాంధ్ర  ప్రాంతం నుండి ఆ పార్టీ సీనియర్ నేత అయిన యనమల రామక్రిష్ణుడు పోటీలో ఉన్నా, చంద్రబాబు భేటీ తరువాత ఆయన స్వఛ్చందంగా పోటీ నుండి తప్పుకోవడంతో రమేష్ పేరు తెరమీదకు వచ్చింది. ఇక రెండో స్థానం తెలంగాణ అభ్యర్థి కోసం టీడీపీ వర్గాల్లో ఉఠ్కంఠగా ఉంది. తాజాగా సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఒక వేళ బీసీ వర్గం నుండి ఇస్తే ఆ పార్టీ సీనియర్ నేత అయిన దేవేందర్ గౌడ్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి తెలంగాణ సీటు ఎవరు దక్కించుకుంటారోనని టీడీపీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maoist leader azads encounter was genuine sc
Actress genelia realty firm face cheating case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles