2012-2013 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. కేవలం వేతన జీవులకు తప్పించి అన్ని విభాగాల్లో పన్నును పెంచేస్తారని విశ్లేషకులు అనుకున్నారు. అయితే భారతీయులు విశేషంగా ప్రేమించే సినిమాకు ఈసారి ఆర్థిక మంత్రి వరమిచ్చారనే అనుకోవాలి. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సర్వీస్ టాక్స్ భారాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
ఎప్పటి నుండో మన తెలుగు చిత్రసీమ పెద్దలు పన్ను ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నో సార్లు కోరారు. మన సినీ పెద్దల విజ్ఞప్తిని ప్రభుత్వం చూస్తామని మాట ఇచ్చినా ఇసుమంత కూడా కదలలేదు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ కడుతున్న పన్నును మినహాయిస్తున్నామని చేసిన ప్రకటనకు యావత్ సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది.
ముఖ్యంగా మన తెలుగు సినీ పరిశ్రమ. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె.యల్. శ్రీనాథ్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల ఎన్నో చిన్న సినిమాలు పుట్టుకొచ్చి పరిశ్రమ కళకళలాడుతుందని మన దర్శకనిర్మాతలు తమ ఆనందాన్ని పంచుకున్నారు.
అంతేకాదు, ఉద్యోగులను ఊరిస్తున్న ఆదాయ పన్ను పరిమితి పెంపుపై ప్రణబ్ బడ్జెట్లో ప్రస్తావించారు. పన్ను పరిమితిని 2 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ఆయన చెప్పారు. రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు 10 శాతం పన్నును, పది ల క్షలకు పైగా ఆదాయానికి 30 శాతం పన్ను విధించేందుకు నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కోసం 5 వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. సేవింగ్స్ ఖాతాల్లోనూ రూ.10 వేల వడ్డీ వరకు పన్ను మినహాయింపు ఇస్తామన్నారు. కార్పొరేట్ టాక్స్ల్లో ఎలాంటి మార్పు లేదన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more