Women in politics

Women in politics, hindustan times, news, Rajya Sabha, Pakistan, Bangladesh, Nepal, politics, Brinda Karat, All India Democratic Women's Association, AIDWA, Sudha Sundararaman, Women's Reservation Bill

Women in politics

Women.gif

Posted: 03/09/2012 03:22 PM IST
Women in politics

Women in politics

ఆకాశంలో సగం మీరు అని కీర్తిస్తూనే రాజకీయాలలో మాత్రం కనీసం 33 శాతం కూడా కాదంటున్నాయి భారత దేశంలోని రాజకీయ పార్టీలు. మహిళాదినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య దేశాలలో జాతీయ స్థాయి మహిళ రాజకీయ భాగస్వామ్యంపై వెల్లడైన గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాలలో మనది 105వ స్థానం. చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామన్న హామీని అటకెక్కించేసిన ఘనత మనది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే భారత్‌ ఈ విషయంలో పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, బాంగ్లాదేశ్‌, నేపాల్‌లకన్నా వెనుకబడి ఉన్నది.

లోక్‌సభలో కేవలం 11శాతం, రాజ్యసభలో 10.7శాతంతో భారత్‌ 105వ స్థానంలో ఉన్నట్టు ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ అనే అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లోని 543 సభ్యుల లోక్‌సభలో కేవలం 60 మంది మాత్రమే మహిళలు కాగా, 240 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో కేవలం 24 మంది మాత్రమే స్ర్తీలు. ప్రస్తుతం లోక్‌సభలో ఐదు, రాజ్యసభలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దక్షిణాఫ్రికా దేశమైన కోటె డి వోయిర్‌తో కలిసి భారత్‌ 105వ స్థానాన్ని పంచుకుంటోంది.

నేపాల్‌ కన్నా 85 స్థానాల దిగువన, పాకిస్థాన్‌ కన్నా 53 స్థానాలు వెనుకబడి మన ర్యాంకింగ్‌ ఉన్నది. చైనా 60వ స్థానంలోనూ, బాంగ్లాదేశ్‌ 65వ స్థానంలోనూ ఉన్నాయి. కేవలం శ్రీలంక, మయన్మార్‌లు మాత్రమే మనను అధిగమించి 129, 134 స్థానాలను ఆక్రమించాయి. పేద ఆఫ్రికన్‌ దేశాలైన రువాండా, ఉగాండా, సూడాన్‌, టునీషియా, టాంజేనియాలలో రాజకీయాలో మహిళా భాగస్వామ్యం చురుకుగా కనిపిస్తుంది. దిగువ సభలో 56శాతం మహిళా ప్రతినిధులతోనూ, ఎగువ సభలో 38శా తంతోనూ రువాండా ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉన్నది. దాదాపు 36 శాతం మహిళా ప్రతినిధులతో టాంజానియా స్పెయిన్‌తో కలిసి 18వ స్థానాన్ని పంచుకుంటోంది. 35శాతం మందితో ఉగాండా 19వ ర్యాంక్‌లోనూ, 26శాతం మహిళా ప్రతినిధులతో టునీసియా 34, సూడాన్‌ 35వ స్థానాల్లో ఉన్నాయి.

వాయువ్య యూరోప్‌ దేశమైన అండోరా 50శాతానికి పైగా మహిళల ప్రాతినిధ్యంతో రెండవ స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో క్యూబా, తర్వాత స్వీడన్‌ ఉన్నాయి. ధనిక, బలమైన దేశాలు అయిన యుఎస్‌, బ్రిటన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీలు వరుసగా 78, 53, 57, 69,21వ స్థానాలను ఆక్రమించాయి. ఇదిలా ఉండగా సౌదీ అరేబియా, కతార్‌, బెలిజె, పాలౌ, మిక్రొనేసియా, నౌరు,సాలమన్‌ ద్వీపాలలో జాతీయ రాజకీయాల్లో అసలు మహిళల భాగస్వామ్యమే కనిపించదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr statue
Facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles