The last new ipod was introduced

The Last New iPod Was Introduced,iPod touch, and a 4th generation iPod shuffle

The Last New iPod Was Introduced

New iPod.gif

Posted: 03/09/2012 01:38 PM IST
The last new ipod was introduced

The Last New iPod Was Introduced

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా కొత్త ఐప్యాడ్‌ను ఆవిష్కరించింది. ఐప్యాడ్ సిరీస్‌లో ఇది మూడోది. మరింత శక్తిమంతమైన చిప్, హై-డెఫినిషన్ స్క్రీన్, మెరుగైన 5 మెగా పిక్సెల్ కెమెరా, 4జీ టెక్నాలజీకి అనువైనదిగా దీన్ని తీర్చిదిద్దారు. ఐప్యాడ్2 కన్నా ఇది కొంచెం మందంగా 9.4 మిల్లీమీటర్లుగా ఉంటుంది. వై-ఫై ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ సుమారు 10 గంటలు ఉంటుందని, అదే 4జీ ఉపయోగిస్తే ఒక గంట తగ్గుతుందని యాపిల్ మార్కెటింగ్ చీఫ్ ఫిల్ షిలర్ తెలిపారు. ఇక స్టోరేజి సమస్యలు కూడా లేకుండా ఇందులో ‘ఐక్లౌడ్’ పేరిట క్లౌడ్ సర్వీసులు కూడా అందిస్తున్నట్లు వివరించారు. దీనితో కంటెంట్‌ను ... ఐప్యాడ్‌లోనే భద్రపర్చుకోవాల్సిన పని లేకుండా కంపెనీ సర్వర్లలో ఉంచుకోవచ్చు.

యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణానంతరం ప్రవేశపెడుతున్న తొలి ఐప్యాడ్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది మూడో వెర్షన్ అయినప్పటికీ ఐప్యాడ్3 అనకుండా కొత్త ఐప్యాడ్‌గా మాత్రమే యాపిల్ దీన్ని పేర్కొంటోంది. ఈ నెల 16 నుంచి అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లో ఐప్యాడ్‌ను విక్రయిస్తారు.

భారత్‌లో దీన్ని ఎప్పుడు ప్రవేశపెడతారన్నది కంపెనీ వెల్లడించలేదు. కొత్త ఐప్యాడ్ ధర వై-ఫై రకానికైతే 499-699 డాలర్లు (రూ. 24,950- రూ. 31,450) మధ్య ఉంటుంది. అదే 4జీ వెర్షన్‌కైతే 629-829 డాలర్లు (రూ. 31,450-41,450) దాకా ఉంటుంది. తాజా ఐప్యాడ్ రాక నేపథ్యంలో ఐప్యాడ్2 రేటును 100 డాలర్ల దాకా తగ్గించడంతో ఇది ఇకపై 399 డాలర్లకు లభించనుంది. దేశీయంగా రిలయన్స్ డిజిటల్, క్రోమా తదితర రిటైల్ స్టోర్స్‌లో యాపిల్ ఉత్పత్తులు లభిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru and renuka choudary in rajya sabha race
Sri rama navami utsavam at bhadrachalam sita ramachandra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles