Chandrababu naidu speech in assembly

Chandrababu Naidu speech in Assembly, Nara Chandrababu Naidu,speaker, nadendla, CM Kiran kumar Reddy, assembely, TDP, bbau,

Chandrababu Naidu speech in Assembly

Chandrababu.gif

Posted: 03/06/2012 10:29 AM IST
Chandrababu naidu speech in assembly

Chandrababu Naidu

స్పీకర్ సభను అర్ధాంతరంగా ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం కావడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేసిన తరువాత టీడీఎల్పీ కార్యాలయంలో ఎర్రబెల్లి, మోత్కుపల్లి, అశోక్‌గపతిరాజు, గాలిముద్దుకృష్ణమనాయుడులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాము సభను నడపడానికి సహకరిస్తున్నా ..నడపడం లేదని ఆరోపించారు. 15 నిమిషాలు వాయిదా అంటారు.. గంట వరకు సభ మొదలు కాదన్నారు. ప్రభుత్వానికి సభను నడపడం ఇష్టం లేదని, కాడి పడేసిందని వ్యాఖ్యానించారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు ఇచ్చిన హామీ అమలుపై సీఎం ఇచ్చిన సమాధానంలో స్పష్టత లేదన్నారు. తనకు మాట్లాడడానికి మైకు కూడా ఇవ్వలేదన్నారు. సమ్మెకాలంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారు, నెరవేర్చకుంటే ఎందుకు నెరవేర్చలేదో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

610 జీవో అమలుకు కమిటీ వేస్తానన్న హామీని ఎందుకు నెరవేర్చలేదన్నారు. అసెంబ్లీని సక్రమంగా నడపకపోతే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాం తాల్లో జరిగిన ఆందోళనలో విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేసే హామీపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇరు ప్రాంతాల్లో ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని బాబు డిమాండ్ చేశారు. ఉపఎన్నికల ఎజెండా స్పష్టం గా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలని వ్యాఖ్యానించారు. ఎవరి ప్రయోజనాలు ఆశించి జగన్, కేసీఆర్‌లు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sarve satyanarayana another mp anjan kumar yadav
Samajwadi party first in the election race in up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles