Bharatnatyam dance

Bharatnatyam Dance, Jaipur foot, Mayuri, airport officers, Hyderabad, Goa, Mumbai, Harazament, Rooms, Stars Sudha Chandran

Bharatnatyam Dance

Bharatnatyam.gif

Posted: 03/05/2012 11:28 AM IST
Bharatnatyam dance

Bharatnatyam Dance

ఆమె విధిని ఎదిరించింది. ఎందరికో స్ఫూర్తి ప్రదాత అయింది. నేటికీ భరత నాట్యం తన జీవన వేదం అంటోంది. కానీ విమానాశ్రయ అధికారులకు మాత్రం కనికరంలేదు. జైపూర్‌ పాదంతో ఉన్న ఆమెను భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వేధిస్తున్నారు. కేంద్ర మంత్రులను కూడా బట్టలూడదీసి పరిశీలించే అమెరికా అధికారులైతే అది ఒక మాదిరిగా మనసుకు సమాధానం చెప్పుకోవచ్చు. కానీ నాట్యమయూరి సుధా చంద్రన్‌కు జరుగుతున్న అన్యాయం సొంత గడ్డమీద కావడం ఈ కళాకారిణికి మరింత బాధ తెస్తోంది. హైదరాబాద్‌, ముంబాయి, చెన్నై విమానాశ్రయాల్లో ఆమెను అధికారులు వేధిస్తున్నారు. దీనికి ఉదాహరణగా త్రివేండ్రంలోని విమానాశ్రయ ఘటనలు ఆమె చెబుతున్నారు. కేవలం పది రోజుల తేడాలో రెండుసార్లు తనను మానసికంగా వేదనకు గురిచేశాయని త్రివేండ్రం అధికారుల తీరును ఎండగట్టింది. తన కృత్రిమ పాదంలో స్క్రూలు ఉన్నాయని, వీటి వివరాలు తెలిపే వైద్యనిర్థరణ పత్రాలు చూపినా అధికారులకు కనికరం కలుగటం లేదని అంటోంది. ముంబాయి అధికారుల మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారని, తాను ఒక కళాకారిణిని, నటిని అని చెబితే, నువ్వెవరో మాకు తెలియదు, మేకప్‌ లేకపోతే గుర్తుపట్టలేకపోతున్నాం అంటూ గేళిచేస్తున్నారని అన్నారు. త్రివేండ్రంలోనని అధికారులు తనను దుస్తులు తీయాలని ఆదేశించారని అన్నారు. తాను కేవలం సల్వార్‌ కమీజ్‌ ధరించానని, అక్కడ ఛేంజింగ్‌ రూంలు లేవని అన్నారు. అందరి ముందు తన జైపూర్‌ పాదాన్ని విప్పి చూపమన్నారని చెప్పారు. ఒక కళాకారిణిగా  ఎంత మంది తనను చూడగానే గుర్తిస్తున్నారన్నది ప్రధానం కాదని, తాను ఫలానా నటిని అని, వైద్యపత్రాలు చూపినా కనికరం చూపకపోవడం తనను చిత్రహింసలు చేయడమేఅని అంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Earthquake in new delhi and northern areas
15 mlas besides 3 ex ministers watched porn  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles