Speaker sacks 16 jagan mlas

Speaker sacks 16 Jagan MLAs, 16 Congress MLAs, ex-MLA of the Praja Rajyam, Sobha Nagireddy, Kadapa MP Y.S. Jagan Mohan Reddy

Speaker sacks 16 Jagan MLAs

Jagan.gif

Posted: 03/03/2012 10:28 AM IST
Speaker sacks 16 jagan mlas

Speaker sacks 16 Jagan MLAs

విప్‌ ధిక్కరించిన జగన్‌ గ్రూపు ఎమ్మెల్యేలపై వేటు పడింది. రాత్రి పొద్దుపోయాక స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పదహారు మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. శోభానాగిరెడ్డి రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వేటుపడిన వారిలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (రామచంద్రాపురం), అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట), సుచరిత (పత్తిపాడు), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వేకోడూరు), చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూర్‌), బాబూరావు (పాయకరావుపేట), గుర్నాథ్‌రెడ్డి (అనంతపురం అర్బన్‌), కొండా సురేఖ (పరకాల), ధర్మాన కృష్ణదాస్‌ (నర్సన్నపేట), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (ఒంగోలు), బాలరాజు (పోలవరం), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి), ప్రసాదరాజు (నర్సాపురం), పిన్నెలి రామకృష్ణారెడ్డి (మాచర్ల) ఉన్నారు. పిఆర్పీకి చెందిన ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి (ఆళ్ళగడ్డ) రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు.

డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి పదహారు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఒక పిఆర్పీ ఎమ్మెల్యే అనుకూలంగా ఓటు వేశారు. వారంతా పార్టీ విప్‌ను ఉల్లంఘించారు. విప్‌ ధిక్కరించిన ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సిఎల్పీ, పిఆర్పీ ఎల్పీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారించిన స్పీకర్‌ ఎమ్మెల్యేల వివరణలు కోరారు. వారంతా మూకుమ్మడిగా వచ్చి కలిశారు. కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీకి తనకు విప్‌ జారీ చేసే అధికారం లేదని, అలా చేస్తే కోర్టుకెళ్తానని శోభానాగిరెడ్డి తెలిపారు. న్యాయవాదిని వెంట బెట్టుకుని మరీ స్పీకర్‌ను కలిశారు. విప్‌ అందలేదని కాపు రామచంద్రారెడ్డి కూడా తనపై ఫిర్యాదు చేయడాన్ని అభ్యంతరం పెట్టారు. చివరికి వారిద్దరూ రాజీనామాలు చేశారు. మూకుమ్మడిగా కాకుండా వ్యక్తిగతంగా వచ్చి కలవాలని స్పీకర్‌ వారికి తేదీలు ఖరారు చేశారు. స్పీకర్‌ ఆదేశాన్ని వారు తిరస్కరించారు. స్పీకర్‌ సమక్షంలోనే తాము విప్‌ ఉల్లంఘించామని, అవిశ్వాసానికి ఓటు వేశామని, మళ్ళీ వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. స్పీకర్‌ ఎలాంటి నిర్ణయాన్నీ ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టారు. రాజీనామా చేసినా శోభానాగిరెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తనను స్వతంత్ర సభ్యురాలిగా గుర్తించాలని లేదా రాజీనామా అయినా ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా వారి నుండి స్పీకర్‌ వివరణ తీసుకున్నట్లు తెలిసింది. వేటు వేస్తే వివిధ కారణాలతో ఖాళీ అయిన ఏడు స్థానాలతో పాటు ఈ పదిహేడు స్థానాలకూ ఉప ఎన్నికలు జరుగుతాయని ఎమ్మెల్యేలు భావించారు. అయితే ఏడు స్థానాలకు ఎన్నికలు పూర్తయిన తర్వాతే వేటు వేయాలని మొదటి నుండీ కాంగ్రెస్‌ పార్టీ భావించింది. అప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్పీకర్‌పై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఈ సమయంలో ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆరు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. సరైన సమయం కోసం ఎదురుచూసిన స్పీకర్‌ వారిపై వేటు వేసినట్లు తెలిసింది. రెండ్రోజుల క్రితం జగన్‌కు మద్దతిస్తున్న ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ ఆమోదించిన విషయం తెలిసిందే. నగరానికి మీరాకుమార్‌ వచ్చారు. ఆమెను రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ కలుసుకున్నారు. ఆమెను కలుసుకుని వచ్చిన తరువాతే ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ అందుబాటులో ఉన్న విలేకరుల సమక్షంలో ప్రకటన విడుదల చేశారు. 21ఎ కింద ముగ్గురిపై, 21 బి కింద పదమూడు మంది ఎమ్మెల్యేలపై వేటు వేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, విప్‌ ధిక్కరణ, సొంత పార్టీలో ఉండలేమని చెప్పిన శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కొండా సురేఖలను 21ఎ కింద, విప్‌ ధిక్కరణ కింద మిగిలిన వారిని అనర్హులుగా ప్రకటించారు. సిబిఐ ఛార్జీషీటులో వైఎస్‌ పేరు చేర్చడాన్ని నిరసిస్తూ గత సంవత్సరం ఆగస్టు 24న 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అందులో కొంతమంది తిరిగి కాంగ్రెస్‌పార్టీ గూటికి చేరారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈ పదిహేడు స్థానాలకు ఆరు నెలల లోగా ఎన్నికలు జరుగుతాయి. స్పీకర్‌ నిర్ణయంతో రాజకీయ వేడి మరింత ఎక్కువైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm gives earful as anam found smoking in assembly premises
Late night decision of speaker removing mlas  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles