Chandrababu vs dharmana serious dialogue

Chandrababu vs Dharmana serious dialogue,Andhra Pradesh, Dharmana Prasad Rao,Minister Dharmana be hauled up criminally for misuse of office,Naidu, Chandrababu Naidu, change of examinations venue, Dharmana Prasada rao, marriage reception of Dharmana’s son, Telangana issue

Chandrababu vs Dharmana serious dialogue

Chandrababu.gif

Posted: 02/23/2012 10:46 AM IST
Chandrababu vs dharmana serious dialogue

 Chandrababu vs Dharmana serious dialogue

'గుండెల్లో నిద్రపోతాను. మిమ్మల్ని వదిలిపెట్టను. తమషా చేస్తున్నారా? ప్రజాస్వామ్య మనుకుంటున్నారా? రాచరికమనుకుంటున్నారా? శాశ్వతంగా చంచల్‌గూడ జైల్లో ఉంటారు జాగ్రత్త' అని ప్రతిపక్ష నాయకుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు మంత్రులను హెచ్చరించారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరుషపదజాలంతో దూషించారు. గవర్నర్‌ బడ్జెట్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన శాసనసభలో మాట్లాడుతూ ఘాటుగా హెచ్చరికలు చేశారు. పక్కా గృహాల మంజూరుకు సంబంధించి మంత్రి పార్థసారథి అధికారులకు జారీ చేశారని భావిస్తున్న ఒక ఇ-మెయిల్‌ లెటర్‌ సభలో తీవ్రస్థాయిలో దుమారానికి దారితీసింది. అధికార, ప్రధాన ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.

కాంగ్రెస్‌ నాయకులు, మాజీ శాసనసభ్యులను లబ్ధిదారుల ఎంపికలో ఎలా భాగస్వాములను చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. మొదట ఆ లేఖ తాను రాయలేదని చెప్పిన మంత్రి పార్థసారథి, తరువాత లేఖను సమర్థించుకున్నారు. తన ఇష్టం వచ్చినట్లే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ప్రకటించారు . ప్రజాస్వామ్యమనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మపరిశీలన చేసుకోండి, ప్రజలకు జవాబుదారీగా ఉండండి. లబ్ధిదారుల ఎంపిక ప్రజల డబ్బుకు సంబంధించినదని గుర్తుంచుకోండని ఆయన మంత్రి పార్థసారథిని హెచ్చరించారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సంబంధించిన అంశం కూడా తీవ్రస్థాయిలో దుమారానికి దారితీసింది. ధర్మాన కుమారుడి పెళ్ళి రిసెప్షన్‌ కొరకు విఆర్‌ఒ పరీక్షా కేంద్రాన్ని రద్దుచేసిన ఫలితంగా ఒక తండ్రి మరణించాడని, పరీక్ష రాయవలసిన అమ్మాయి కాళ్ళు విరిగి అవిటిదైపోయిందని, దీనికి బాధ్యులెవరని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై మంత్రి ధర్మాన తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ కళాశాల పరీక్షా కేంద్రంగా నోటిఫై కానపుడు ఆ మరణానికి తనకేమి సంబంధమని ప్రశ్నించారు. ప్రతిపక్షానికి సంబంధించిన ఒక గజెట్‌ పత్రికలో వచ్చిన వార్తను పట్టుకొని, వాస్తవాలను నిర్ధారించుకోకుండా చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు మాట్లాడటమేమిటని మంత్రి ప్రశ్నించారు. తెలిసీతెలియక ఒక ఇంగ్లీష్‌ చానెల్‌ ఆ అంశాన్ని ప్రసారం చేసిందని, వాస్తవం వేరని మంత్రి అన్నారు. ఆ కళాశాలను తాను కొన్ని నెలల క్రితమే రుణం చెల్లించి కుమారుడి రిసెప్షన్‌ కొరకు రిజర్వు చేసుకున్నానని చెప్పారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ ప్రజల ప్రయోజనం కొరకు రిసెప్షన్‌ను వేరేచోటికి ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A women was raped by civil judge in khammam district
Chief minister n kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles