Open cast mining in drama village

open cast mining indrama village,COAL MINING,

open cast mining in drama village

indrama.gif

Posted: 02/22/2012 11:08 AM IST
Open cast mining in drama village

ప్రజాభివూపాయానికి వ్యతిరేకంగా, బలవంతంగా ఓసీ గనులను ఏర్పాటు చేయాలని చూస్తే తరిమికొడతామని ఇందారం ప్రజలు హెచ్చరిక జారీ చేశారు. తొమ్మిది రోజులుగా ఉధృతంగా సాగుతున్న ఓసీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా బాధిత గ్రామస్తులు ఇందారంలో జాగారం చేశారు. తెల్లవారుజామున ఓసీలను అడ్డుకుంటామని ప్రమాణం చేశారు. ఓపెన్‌కాస్టు గని సర్వే కోసం వచ్చే సింగరేణి యాజమాన్యాన్ని గ్రామాల్లో అడుగుపెట్టనీయమని స్పష్టంచేశారు. ‘ప్రాణాలయినా అర్పిస్తాం..ఓపెన్ కాస్టులను అడ్డుకుంటాం, ఓసీలు వద్దు..భూగర్భ గనులే ముద్దు’ అనే నినాదాలు బాధిత గ్రామాల్లోని గోడలపై దర్శనమిస్తున్నాయి. ఇందారం గ్రామాన్ని ఆదిలాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్ గోనె శ్యాంసుందర్ రావు, నైనాల గోవర్ధన్ తదితరులు సందర్శించి గ్రామస్తులకు మద్దతు ప్రకటించారు. ఓసీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని గ్రామస్తులకు తెలిపారు. మూడు, నాలుగు రోజుల్లో ఓపెన్ కాస్టులను వ్యతిరేకిస్తూ బెల్లంపల్లిలో రౌండ్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందారం ప్రజలు కదిలిరావాలని శ్యాంసుందర్‌రావు కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress high command gave a shock to pcc chief botsa
Tdp thinking of no confidence motion on speaker  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles