Nagam janardhan reddy vs chandrababu naidu

Nagam Janardhan Reddy Vs Chandrababu Naidu,Nagam, Janardhan, Reddy, fires, Chandrababu,

Nagam Janardhan Reddy Vs Chandrababu Naidu

Nagam.gif

Posted: 02/17/2012 09:57 AM IST
Nagam janardhan reddy vs chandrababu naidu

Nagam Janardhan Reddy Vs Chandrababu Naidu

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ మాజీ నేత నాగం జనార్దన్‌డ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణపై టీడీపీ యూ టర్న్ తీసుకున్న నేపథ్యంలోనే తాను పార్టీ విడిచిపెట్టి వెళ్లినట్లు స్పష్టం చేశారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా నాగర్ కర్నూల్ నుంచి మీరు పోటీ చేసినా, మీ తరఫున కోటీశ్వరుడిని నిలబెట్టినా డిపాజిట్ కూడా దక్కవని నాగం సవాలు విసిరారు. ఈ మేరకు నాగం జనార్దన్‌డ్డి చంద్రబాబుకు బహిరంగ లేఖరాశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీని వీడినట్లు పేర్కొనడం అవివేకమన్నారు. 30 ఏళ్లపాటు టీడీపీలో కొనసాగిన తాను పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడినట్లు గుర్తుచేశారు. టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల్ని ఎండట్టడం, గాలి జనార్దన్‌డ్డి అక్రమాలపై పోరాడిన తీరు, పార్టీ ప్రతిష్టకోసం చేసిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని పార్టీ నేతలతో చర్చించాకే టీడీపీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశామన్నారు. ఇందులో భాగంగానే 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని తెలంగాణలో 39 సీట్లు గెలిచామన్నారు. 200 మహానాడులోనూ తెలంగాణపై తీర్మానం చేయడంతో పాటు ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. 2009లో కేసీఆర్ దీక్ష నేపథ్యంలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ తీర్మానానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ప్రకటిస్తే ఆ నిర్ణయం ఏకపక్షం అంటూ రెండు కళ్ల సిద్ధాంతంతో ముందకు వచ్చారని దుయ్యబట్టారు. ఈ విధంగా తెలంగాణపై యూ టర్న్ తీసుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. 2009లో పార్టీలో చేసిన తీర్మానాన్ని చిదంబరానికి పంపాలని తాను పదేపదే విజ్ఞప్తి చేసినా తిరస్కరించినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ కోసం అమరులైన వారి ఆత్మశాంతికి మౌనం పాటించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించి, జై తెలంగాణ అన్న తనకు నోటీసులు పంపడం ఏం న్యాయమన్నారు. మీరు నైతికంగా ఎప్పుడో దిగజారిపోయారని తీవ్రంగా విమర్శించారు. సీమాంధ్ర రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు ఏకమై కేంద్రపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకునే విధంగా చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State budget introduction in hurdles
Renuka chowdary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles