Renuka chowdary

Renuka Chowdary,Renuka Chowdary Life History,Renuka Chowdary Childhood, Renuka Chowdary Special Interview, Renuka, CM Kiran, Ajad,

Renuka Chowdary

Renuka.gif

Posted: 02/17/2012 09:47 AM IST
Renuka chowdary

Renuka Chowdaryఅధికార కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరిదే రాజ్యంగా నడుస్తోంది. జిల్లా పార్టీలో ఎన్ని గ్రూపులు వర్ధిల్లుతున్నా నేతలందరూ ఆమెకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ అనుక్షిగహం కోసం పాకులాడుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా ఢిల్లీలో అధిష్ఠానానికి చేరువైన ఆమె.. జిల్లా రాజకీయాలను తన చెప్పుచేతల్లో ఉంచుకున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర ఉద్యానవనశాఖ మంత్రి రాంరెడ్డి వెంకటడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఎవరి దారిలో వారు పనిచేస్తున్నా రేణుకకు మాత్రం అనుంగులుగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్‌ను సైతం రేణుక తన ఇంటికి రప్పించుకున్న వైనం కాంగ్రెస్ వర్గాల్లో ఆశ్చర్యాన్ని నింపింది. రచ్చబండ లో భాగంగా జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి సైతం రేణుక జపం చేయటం కేంద్ర రాజకీయాల్లో ఆమె ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. ఇక మంత్రి రాంరెడ్డి వెంకటడ్డి ఇటీవల జరిగిన మంత్రి వర్గవిస్తరణ సమయంలో శాఖ మార్పు కోసం విశ్వవూపయత్నాలు చేశారు. అలాగే భట్టి విక్రమార్క కూడా మంత్రివర్గంలో చోటుకోసం ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా, ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో నాయకుల్లో నైరాశ్యం నిండింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagam janardhan reddy vs chandrababu naidu
Junior doctors call off strike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles