On road show priyanka asks sp nominee to join cong

On road show, Priyanka asks SP nominee to join Cong,Priyanka Gandhi, SP nominee invited, road show, UP Assembly polls, nation news

On road show, Priyanka asks SP nominee to join Cong

Priyanka.gif

Posted: 02/11/2012 09:33 AM IST
On road show priyanka asks sp nominee to join cong

On road show, Priyanka asks SP nominee to join Congయూపిలో తన తల్లి, సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు చేపట్టిన యువనేత్రి ప్రియాంక గాంధీ గల్లీగల్లీకి విస్తృత ప్రచారం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం భర్త రాబర్ట్ ఇద్దరు పిల్లలు రెహాన్, మిరయాలను వెంటబెట్టుకుని మరీ ఆమె రోడ్‌షోల్లో పాల్గొన్నారు. యూపి ప్రజలు ప్రియాంక పట్ల ఎంతో ఆదరణ చూపిస్తున్నారు. ప్రియాంక షోలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పార్టీ నేతలు, అభ్యర్థులు తీసుకుని రోడ్ షోకు బయలుదేరిన ప్రియాంకకు సదర్ ఎస్పీ అభ్యర్థి ఆర్‌పి యాదవ్ ఎదురుపడ్డారు. తాను రైతు కుమారుడినని యాదవ్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ ఆశీస్సులు కావాలని ప్రియాంకను అడిగాడు. వెంటనే ఆమె యాదవ్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ‘నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మని ప్రియాంక ఆహ్వానించారు’ని ఎస్‌పి అభ్యర్థే స్వయంగా చెప్పుకున్నాడు. కాంగ్రెస్‌లోకి వస్తే ఎంతో గౌరవం లభిస్తుందని ఆమె అనగా తాను ములాయం సైనికుడినని బదులిచ్చినట్టు యాదవ్ పేర్కొన్నాడు. సదర్ సీటు తనదేనన్న ధీమా అతడు వ్యక్తం చేశారు. హర్‌చంద్‌పూర్ సెగ్మెంట్‌లో ప్రియాంక విస్తృతంగా పర్యటించారు. అవసరమైనచోట్ల పాదయాత్రలు చేస్తూ ఓటర్లను స్వయంగా కలుసుకుంటున్నారు. ప్రియాంక రోడ్‌షో సమాజ్‌వాది పార్టీ ఆఫీసు మీదుగా వెళ్తుండగా పెద్దఎత్తున ఎస్‌పి కార్యకర్తలు వెలుపలకు వచ్చి ఆసక్తిగా గమనించారు. జోహాసిర్కి ఎన్నికల సభలో మాట్లాడిన ప్రియాంక బిఎస్పీ, ఎస్పీలపై విరుచుకుపడ్డారు. గూండాలు, రౌడీలను పెంచిపోషించారని విరుచుకుపడ్డారు. ప్రజల మధ్య కుల, ప్రాంతీయ వైషమ్యాలు సృష్టించి ఉత్తరప్రదేశ్‌ను నేరమయం చేశారని కాంగ్రెస్ నేత విమర్శించారు. ‘మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్‌కే ఓటేయాలి’ అని అభ్యర్థించారు. కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని ఉత్తమప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని ఆమె హామీ ఇచ్చారు. ఇవి సోనియా, రాహుల్ గాంధీ ఎన్నికలు కాదని యూపి ప్రజల ఎన్నికలని ప్రియాంక స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Electricity pre paid card systems
Areoplane accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles