Cm kiran kumar reddy meet chiranjeevi today

cm kiran kumar reddy, meet ,chiranjeevi, today,

cm kiran kumar reddy meet chiranjeevi today

1.gif

Posted: 02/08/2012 09:21 PM IST
Cm kiran kumar reddy meet chiranjeevi today

chiruఅంతా భావిస్తున్నట్టుగానే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మారే సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతో అవకాశముండీకూడా తక్షణ ప్రయోజనమేమీ ఆశించకుండానే భేషరతుగా కాంగ్రెస్ పార్టీని పలుమార్లు కష్టాల్లో ఆదుకున్న చిరంజీవి త్యాగం ఏమాత్రం వ్యర్థంకాలేదనిపిస్తోంది.

ఎవరేమన్నా, ఎవరిపైనా దుందుడుకు వ్యాఖ్యలు చేయని ఆయని స్వభావమే అతనికి చాలా వరకూ మేలు చేస్తోంది. ఇదే కాంగ్రెస్ హైకమాండ్ వద్ద చిరు ఇమేజ్ పెరగటానికి దోహదకారిగా మారుతోంది. రానున్న రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో చిరు కీలక పాత్ర పోషించబోతున్నారనేది హస్తిన కేంద్రంగా కొంతకాలంగా వినిపిస్తోన్న వార్తే.

cm_kiranతాజాగా చిరంజీవితో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. చిరంజీవిని ఈ సాయంత్రం ముఖ్యమంత్రి ఏకంగా ఆయన నివాసానికి వెళ్లి మరీ చాలాసేపు చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పు వలన కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రగిలిన నేపథ్యంలో వీరి భేటీకి ప్రాముఖ్యత సంతరించుకుంది.

raghu_veeraఈ భేటీలో మంత్రి రఘువీరారెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో చిరు సూచనలు, సలహాలను సీఎం శ్రద్ధగా ఆలకించినట్టు తెలుస్తోంది. సమిష్టిగా పాలనను ముందుకు తీసుకెళ్లి, రాష్ట్రాన్ని అభివ్రద్ధి పథాన నడిపించాలని చిరు సీఎంను కోరినట్టు వినికిడి. ఏ అండా లేకుండానే సినిమాల్లో తన పరిశ్రమతో మెగాస్టార్ అయిన చిరంజీవి రాజకీయాల్లోనూ తన హవా చాటుకునే సూచనలు సుస్పష్టం.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vaibhav jewelers owner murdered
Bjp nitin gadkari stage collapse  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles