New maldives president appeals for calm

Maldives News, Minivan News, Maldives Politics, Human Rights, News and Media,Bigadier Ahmed Shyiam, Hassan Saeed, Maldives, Maldivian National Defence Forces, Mohamed Nasheed, Mohammed Waheed Hassan

Sources say new chief of police and army have been appointed. Brigadier Ahmed Shiyam, who was chief of the Male Command, has been made the new Chief of Maldivian National Defence Forces

police elements join opposition protest.gif

Posted: 02/08/2012 01:21 PM IST
New maldives president appeals for calm

Maldives-Presidentపోలీసులు వ్యవస్థ ప్రభుత్వ ఆదేశానుసారమే పని చేస్తుంది. మరి అలాంటి పోలీసులో ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తే... అలాంటి సంఘటనే మాల్దీవుల్లో జరిగింది. దుష్ప్రవర్తన, ప్రతిపక్ష నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో క్రిమినల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అ బ్దుల్లా మహమ్మద్ అరెస్టునకు అధ్యక్షుడు నషీద్ మూడు వారాల క్రితం ఆదేశించారు. అప్పటి నుంచి అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలతో అధ్యక్ష పదవికి నషీద్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చే స్తున్నాయి. ఈ క్రమంలో మూడు వారాలుగా ఆందోళ నకు దిగాయి.

మాల్దీవుల్లో నెలరోజులుగా జరుగుతున్న పరిణామాలు తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడి రాజీనామాకు దారి తీశాయి. మంగళవారం ఉదయమే అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మహమ్మద్ నషీద్ టెలివిజన్‌లో ప్రసారమైన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. "ప్రస్తుత పరిస్థితుల్లో నేను రాజీనామా చేయడమే దేశానికి శుభప్రదం. దేశాన్నిని యంతలాగా ఏలాలని నేను అనుకోలేదు. అందుకే రాజీనామా చేశాను.'' అని వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో పోలీసుల్లో తిరుగుబాటు వర్గం చేతులు కలిపింది. సోమవారం అర్థరాత్రి దాటాక అధ్యక్ష అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు ఈ ఘర్షణలు కొనసాగాయి. తరువాత ప్రభుత్వ టెలివిజన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసువర్గాలు.. ప్రతిపక్షానికి చెందిన ప్రసారాలు చేయడం ప్రారంభించింది. దీంతో ఇక తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా అధ్యక్షుడు నషీద్ ప్రకటించారు. నషీద్ స్థానంలో అధ్యక్షునిగా ఉపాధ్యక్షుడు మహమ్మద్ వహీద్ బాధ్యతలు స్వీకరించారు. కాగా, మాల్దీవుల్లో 'అకస్మిక పరిణామాల'ను నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా భారత్ ప్రకటించింది. ఇక్కడ ఉన్న 30వేల మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాలశాఖ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Is obama coalition re emerging
Porn in assembly3 bjp ministers resign in karnataka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles