Plants speaking together

Plants speaking together,Speaking the language of plants, hydrogen atoms, Sun, plants, humans

Plants speaking together

Plants.gif

Posted: 02/06/2012 11:13 AM IST
Plants speaking together

Plants speaking together మొక్కలకు కూడా ప్రాణముంద ని, వందేళ్ల క్రితమే ‘క్రిస్కోగ్రాఫ్’ ద్వారా వాటి స్పందనలను రికార్డు చేసి మరీ నిరూపించారు రేడియో సైన్స్ పిత, ప్రఖ్యాత భారత శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్. అయితే మొక్కలు పరస్పరం మాట్లాడుకుంటాయి కూడా అంటున్నారు బ్రిటన్‌లోని ఎక్సెటర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు! క్యాబేజీ మొక్కల మధ్య జరిగిన సమాచార మార్పిడి ప్రక్రియను తాము కెమెరా ద్వారా రికార్డు చేశామని వారు ప్రకటించారు. మొక్కలు పరస్పరం రహస్య సంకేతాలతో మాట్లాడుకుంటాయన్న విషయాన్ని జన్యుమార్పిడి చేసిన క్యాబేజీ మొక్కపై జరిపిన పరిశోధన ద్వారా తాము నిరూపించామని వెల్లడించారు.

ఇదీ ప్రయోగం: పరిశోధనలో భాగంగా.. ఆకును గానీ, కాండాన్ని గానీ కత్తిరించినప్పుడు ఓ వాయువును విడుదల చేసేలా ఓ క్యాబేజీ మొక్క జన్యువులో శాస్త్రవేత్తలు తొలు త మార్పులు చేశారు. తర్వాత వాయువులు, రసాయనాలను వీడియో కెమెరాలో బంధిం చేందుకు వీలుగా.. మిణుగురు పురుగుల్లో వెలుగులకు కారణమయ్యే ‘లూసిఫెరేజ్’ అనే ప్రొటీన్‌ను ఈ జన్యుమార్పిడి మొక్క డీఎన్‌ఏకు జతచేశారు. అనంతరం మొక్క ఆకును కత్తిరించడంతో అది ‘మిథైల్ జాస్మోనేట్’ అనే వాయువును విడుదలచేసింది. దీన్ని పసిగట్టిన సమీపంలోని రెండు మొక్కలు తమను తాము కీటకాల నుంచి రక్షించుకునేందుకు ఆకులపై విష రసాయనాలను విడుదల చేశాయి. ఈ మొత్తం ప్రక్రియ ను వీడియో కెమెరాలో బంధించారు. తొలి మొక్క హెచ్చరికతోనే మిగతా రెండు అప్రమత్తమయ్యాయని, అంటే వాటి మధ్య రహస్య సంభాషణ జరిగినట్టేనని శాస్త్రవేత్తలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi vs elephant
Rahul gandhi takes on mayawati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles