Cm reasoning with high command for cabinet expansion

cm reasoning with high command for cabinet expansion, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

cabinet-expansion-1.gif

Posted: 02/05/2012 12:28 PM IST
Cm reasoning with high command for cabinet expansion

cabinet-expమంత్రివర్గ విస్తరణ కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఢిల్లీలో పెద్దల అనుమతులకోసం తనవంతు కృషి చేస్తున్నారు. తన ల్యాప్ టాప్ లో విస్తరణ ప్రణాళికను పొందుపరచి ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి తన వాదనను రాష్ట్ర పార్టీ వ్యవహారలను సమీక్షించే గులామ్ నబీ ఆజాద్ దగ్గర్నుంచి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వరకూ అందరకూ వినిపిస్తూ తిరుగుతున్నారు. అయితే ఇంకా ఆశించిన ఫలితాలేమీ రాలేదని తెలుస్తోంది. ఉదయం నుంచీ ఏపి భవన్ లో ఒంటరిగా ఎవరినీ కలవకుండా ఉండటమే అందుకు సంకేతంగా కనిపిస్తోంది.

పార్టీలోని అంతర్గత విభేదాల వలన తను అనుకున్న పనికి ఆటంకాలు కలుగుతున్నాయని అందుకు ప్రత్యామ్నాయంగా తనదైన మంత్రి వర్గాన్ని తాను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి భావించటం సహజం. దానికి తోడు తెలంగాణా ఉద్యమాన్ని విజయవంతంగా ముగింపు తీసుకుని వచ్చిన తర్వాత తెలంగాణా లో పర్యటించి ప్రచారం చెయ్యాలీ అంటే కొందరు తెలంగాణా మంత్రులు ఆయనకు అవసరం. కనీసం ఇద్దరు తెలంగాణా ప్రాంతం నుంచి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని, శంకరరావుని తొలిగించినందువలన ఏర్పడ్డ ఖాళీని దళిత నాయకుడితో పూరించాలన్నది కూడా కిరణ్ కుమార్ ఆకాంక్షే.

మంత్రి వర్గాన్ని తను అనుకున్నట్టుగా విస్తరింపజేయలేకపోవటం, ప్రధాన మంత్రిని హైదరాబాద్ రప్పించలేకపోవటం ఇవన్నీ కిరణ్ కుమార్ కి తన స్థానం మీద, రాష్ట్ర రాజకీయాల మీద పట్టు లేదు అని చెప్పకనే చెప్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలని ఆయన ఢిల్లీలో చెయ్యగలిగిన కసరత్తులన్నీ చేస్తున్నారు.

అయితే, పిల్లవాడికి సినిమాకు పోవాలనే ఉంటుంది, పెద్దలకూ సినిమా చూపించాలనే ఉంటుంది కానీ విస్తృత స్థాయిలో ఆలోచించే పెద్దలు ఒక్కోసారి అనుకున్న ప్రోగ్రాంనే రద్దు చేసుకోవచ్చు. అదీ కుటుంబ శ్రేయస్సుకే అని వాళ్ళకి తెలుసు కానీ పిల్లలకు తెలియదు. నాన్న ఎప్పుడూ ఇంతే అనుకుంటుంటారు. ప్రైవేటు రంగ సంస్థల్లో ప్రతి సంవత్సరం ఒక సమస్య ఎదురవుతుంటుంది. అది ఉద్యోగులకిచ్చే ఇంక్రిమెంట్లు. ఇవ్వనంత వరకూ ఏమీ ఉండదు కానీ, ఇక్రిమెంట్లు ఇవ్వగానే ఫిర్యాదులు మొదలౌతాయి. నాకు ఇంత తక్కువెందుకు, వాడికి అంత ఎక్కువెందుకు అని యాజమాన్యం మీద గుర్రుగా ఉంటారు కొన్నాళ్ళు.

మంత్రి వర్గ విస్తరణ జరగనంత వరకూ ఏ గొడవా ఉండదు. ఎవరికి వారు వారి వారి గురించి వారికి తోచిన పద్ధతిలో లాబీయింగ్ చేసుకుంటారు, కలల్లో జీవిస్తారు. కానీ మంత్రివర్గంలో మార్పులు, విస్తరణ జరగగానే, అవకాశమందుకోనివారికి పార్టీ మీద కోపం వస్తుంది. ఆ కోపంలో వారు మరో పార్టీకి మారే అవకాశం కూడా ఉంది. రాబోయే ఉప ఎన్నికల దృష్ట్యా అది పార్టీకి నష్టం చేకూర్చవచ్చు, దాని ప్రభావం సార్వ్రతిక ఎన్నికల మీద కూడా పడవచ్చు. ఇదీ ఢిల్లీ పెద్దల భయం, జాగ్రత్త.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cricketer yuvaraj singh with cancer in chemo therapy
Acb raids on liquor syndicates reveal bribes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles