China jeeyar swamy blames ttd for not following the scriptures

china jeeyar swamy blames ttd for not following the scriptures, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

china jeeyar swamy blames ttd for not following the scriptures, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

jeeyar-1.gif

Posted: 02/04/2012 12:14 PM IST
China jeeyar swamy blames ttd for not following the scriptures

jeeyar-swamyతిరుమలలో వెయ్యికాళ్ళ మండపాన్ని కూల్చివేసినందువలనే రాష్ట్రంలో అరిష్టారు జరుగుతున్నాయన్నారు త్రిదండి చినజీయర్ స్వామి. ఇక్కడ శ్రీనివాసుడిని మనం చల్లగా చూసుకుంటేనే మనమూ చల్లగా ఉంటాం అంటున్నారాయన. నిన్న సామూహిక విష్ణు సహస్రనామాలను నిర్వహించిన తర్వాత తిరుమల తిరుపతి పురవీధుల్లో ర్యాలీని నిర్వహించిన త్రిదండి తితిదే పరిరక్షణకు కంకణబద్ధులవుదామని భక్తులదరికీ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా తిరుపతి ఇతర చిన్న చిన్న గుడులలాంటిది కాదని, దీనికి చారిత్రాత్మకమౌన ప్రాశస్తి ఉందని, ఇక్కడ చెయ్యవలసిన అర్చన కైంకర్యాదులు, సేవా కార్యక్రమాలు నిబద్ధతతో జరగాలని, ఇక్కడ 110 విధాలైన తప్పులు జరుగుతున్నాయని జీయర్ స్వామి అన్నారు. చారిత్రక విలువ కలిగిన వెయ్యకాళ్ళ మండపాన్ని కూల్చి కేవలం గోపురాన్ని మొండిగా మిగిల్చారని, నాలుగు మాడవీధులను మాయం చేసారని ఆయన తితిదే యాజమాన్యం మీద ధ్వజమెత్తారు. జరుగుతున్న ఉపద్రవాలకు అదే కారణమని జియ్యర్ స్వామి గట్టిగా చెప్పారు.

మతధర్మాలను పరిరక్షించవలసిందే కానీ మారుతున్న కాలంలో ప్రజల, భక్తుల వసతులను పెంచటం కోసం దేవాలయాలలో మార్పులు జరగటం సహజం. లేదంటే ఎదుగుతున్న జనాభాతో సమానంగా ఆలయాలనూ పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది. వెయ్యి కాళ్ళ మండపానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్న మాట నిజమే కానీ అప్పుడు సందర్శించిన భక్తుల సంఖ్యకూ ఇప్పుడు వచ్చేవారి సంఖ్యకూ పోలికేమైనా ఉందా.  

రాష్ట్రంలో జరుగుతున్న అరిష్టాలన్నిటికీ తిరుపతిలో జరిగే అనాచారమే కారణమైతే, సిబిఐ ప్రస్తుతం చేస్తున్న దర్యాప్తులన్నిటినీ మానుకుని తితిదే లో విచారణ జరిపిస్తే సరి. రాజకీయ నాయకులైనా చర్చల్లో పాల్గొన్నప్పుడు కొన్ని విషయాల్లో పరస్పారవగాహనకు వస్తారేమో కానీ ఆధ్యాత్మిక వాదులు అలా కలిసి పనిచెయ్యలేరని విడివిడిగా పెట్టుకున్న మఠాలను బట్టే తెలుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. రాజ్యాంగాన్ని చర్చించి నిర్ణయానికి రావచ్చు కానీ, ఆధ్యాత్మికం అంతుపట్టని విషయం. ఎవరి అవగాహన వారికే ఉంటుంది. ఎవరి స్థాయి, నమ్మకాలు వారికుంటాయి. అందుకే అన్ని గురుపరంపరలు వచ్చాయి. దానిమీద నాదే అధారిటీ అని ఎవరూ చెప్పలేరు. అందువలన శాస్త్రాలలో రాసిన దానిలో అర్థమైన విధంగా ఆచరించటమే.

ఆచార సాంప్రదాయాలను శాస్త్రం నిర్దేశించిన పద్ధతుల్లో నెరవేర్చటం అవసరమే కానీ ఈ రకంగా బహిరంగ చర్చలు, ఆవేశకావేషాలకు దోహదం చేసే విధంగా విమర్శలను గుప్పించటం వలన అసలే క్షీణించి పోతున్న భక్తి భావన మతాచారాలకు మరింత నష్టం చేకూరుతుందని తితిదే అధికారులు, కొందరు ఆచార్యులు భావిస్తున్నారు. ఎంతో ఖర్చు పెట్టుకుంటూ లక్షలాదిగా తరలివచ్చే భక్తులు సైకర్యాలు సరిగ్గా లేకపోతేనే ఆరోపణలు చేస్తారు. అందువలన వచ్చే ఆదాయంలోంచి భక్తుల సౌకర్యార్థం కొంత భాగాన్ని కేటాయించాలని యాజమాన్యం తపన. మారుతున్న కాలం దృష్ట్యా ఆధ్యాత్మిక రంగం కూడా రాజకీయ రంగంలా ఆందోళనలు నిరసన మార్గాలను పడుతోంది కానీ, అర్చన, అర్పణ, సేవా భావాల జోలికి పోవటం లేదని రాజకీయరంగంలోని వారు కూడా కొందరు ఆనందపడుతున్నారు. ఆచారాలను సరిగ్గా పాటించకపోవటం వలనే అరిష్టం వస్తున్నదని అంటున్న వాదనను కాదనటానికీ ఎవరి దగ్గరా ఆధారాలు లేవు, ఔననటానికీ సాక్ష్యాధారాలు లేవు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Discussion only after strike is called off dl clears
Are ias becoming scapegoats  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles