Andhra pradesh and tamilnadu

andhra pradesh and tamilnadu, Andhra Pradesh Government, Congress party, Tamil Nadu Electricity,Andhra Pradesh Electricity,

andhra pradesh and tamilnadu

Andhra Pradesh.gif

Posted: 02/02/2012 09:49 AM IST
Andhra pradesh and tamilnadu

రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా విద్యుత్ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం గండికొడుతున్నది. రాష్ట్రాన్ని కాదని కేంద్రం తమిళనాడు విద్యుత్ అవసరాలకు పెద్దపీట వేస్తున్నది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్(సీజీఎస్) నుంచి తమిళనాడుకు 540 మెగావాట్ల విద్యుత్ పంపిణీకి కేంద్రం అనుమతించింది. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను ఏవిధంగా అధిగమించాలనే అంశంపై ఇప్పటికే ట్రాన్స్‌కో తలలు పట్టుకుంటుండగా, కేంద్ర ప్రభుత్వ చర్య మూలిగే నక్కపై తాటిపండు చందంగా మారింది. సదరన్ కారిడార్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ పంపిణీ ఒప్పందాలను తమిళనాడు ప్రభుత్వం కాలరాస్తున్నా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని పెద్దలు చేష్టలుడిగినట్లుగా వ్యవహరిస్తుండడం విడ్డూరంగా ఉంది. కేంద్ర సర్కారులో ఐదుగురు కీలక మంత్రులతో పాటు రాష్ట్రం నుంచి 33 మంది అధికారపార్టీ లోక్‌సభ సభ్యులు, పది మందికి పైగా రాజ్యసభ సభ్యులున్నా ఆచరణలో ఫలితం లేకుండా పోతున్నది.

రాష్ట్రంలో వేసవిలో విద్యుత్ అవసరాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి అదనంగా వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఎపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు టెండర్లను నిర్వహించాయి. ట్రాన్స్‌కో ప్రతిపాదించిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కాంట్రాక్టు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కారిడార్ సమస్య వల్ల నాలుగు నెలల కాలానికి 540 మెగావాట్లకు మాత్రమే కారిడార్ అనుమతి లభించింది. ఇది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మే 31వ తేదీ వరకు రోజుకు 540 మెగావాట్ల మేరకు 24 గంటల పాటు విద్యుత్ పంపిణీకి వీలుగా ట్రాన్స్‌కోతో ఒప్పందాలు జరిగాయి. తమిళనాడు ప్రభుత్వం వారం రోజుల ముందుగా కారిడార్ అనుమతికోసం చేసిన రాజకీయ ప్రయత్నాలు ఫలించాయి. ఫలితంగా సదరన్ కారిడార్ నుంచి ప్రతి రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం ఆరు గంటల వరకు తమిళనాడు అవసరాలకోసం 540 మెగావాట్ల విద్యుత్ పంపిణీకి వీలుగా కేంద్రం అనుమతించింది. దీంతో అప్పటి వరకు ఆంధ్రవూపదేశ్ విద్యుత్‌కంపెనీలైన ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు ఉన్న సదుపాయాన్ని రద్దు(క్యాన్సల్) చేస్తూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పీజీసీఐఎల్), సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ)లు ఆదేశాలు జారీచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Why am i singled out asks lt gen noble thamburaj
Great indian gold theft  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles