More time watching tv

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Most time watching TV.GIF

Posted: 02/01/2012 07:51 PM IST
More time watching tv

Watching-tvతల్లిదండ్రులు కేటాయించే ప్రతి నిమిషం పిల్లల భవిష్యత్తుకు వెలకట్టేలేని పెన్నిధి అంటున్నారు పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకులు. ‘ఆధునిక జీవనంలో ప్రతి తల్లిదండ్రీ తమ పిల్లల కోసం ఎంత సమయం కేటాయిస్తున్నారు?’ అనే అంశం మీద ఈ యూనివర్సిటీ పరిశోధకులైన గ్యారీ, వ్యాలెరీలు ఇటీవల ఓ నివేదికను పొందుపరిచారు. వారానికి 168 గంటలు ఉంటే... అమెరికాలోని విద్యావంతులైన తల్లులు తమ పిల్లలకోసం 21 గంటలు, తండ్రులు 9-10 గంటలు మాత్రమే కేటాయిస్తున్నట్టు తెలిసింది. అక్షరం జ్ఞానం అసలే లేని తల్లిదండ్రులు 16 గంటల కన్నా తక్కువ సమమయే పిల్లలతో గడుపుతున్నట్టుగా గుర్తించారు.

చదువుకున్న వారైనా, చదువు లేనివారైనా రోజువారి పనుల తర్వాత పిల్లలకన్నా టీవీ, ఫోన్, కంప్యూటర్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వీరి పరిశోధనలో తేలింది. ఈ తరహా అలవాటు మనదేశంలో తక్కువేమీ లేదు. మారుతున్న కాలంలో పనుల ఒత్తిడి తండ్రితో పాటు తల్లికీ చేరిపోయింది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు అవడం వల్ల ‘పిల్లలతో గడిపే సమయం ఎక్కడుంది?’ అని నిరుత్సాహం వ్యక్తం చేస్తుంటారు. కాని ఇల్లు చేరుతూనే టీవీలకో, ఫోన్లకో, కంప్యూటర్లకో... చెవులు, కళ్లు అప్పగించే తల్లిదండ్రుల సంఖ్యే ఎక్కువ గా ఉంటోంది. ఫలితంగా తలిదండ్రులు- పిల్లల మధ్య బాంధవ్యాలు పలచబడి పోవడమే కాకుండా, అభద్రత, ఆందోళనలు, మానసిక సమస్యలతో పిల్లలు చెడుదారుల వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చైల్డ్ సైకియాట్రిస్టులు చెబుతున్నారు. పెద్దల నిర్లక్ష్యం పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయగలదని హెచ్చరిస్తున్నారు. టీవీల కన్నా పిల్లల బాల్యం ఎంతో విలువైనదిగా గుర్తించమని సూచన చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Great indian gold theft
What is cancer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles