What is cancer

What is Cancer, mouth cancer cancer, zodiac cancer, cells skin cancer, cancer ribbon smoking cancer,

What is Cancer

cancer-1.gif

Posted: 02/01/2012 05:03 PM IST
What is cancer

కాన్సర్ వ్యాధి సోకిందని, కాన్సర్ బాగా ముదిరిన స్థాయిలో ఉందని, కాన్సర్ వలన చనిపోయారని ఇలా కాన్సర్ వ్యాధి గురించి వింటుంటాం.  అలాగే దీని వలన కాన్సర్ వస్తుంది, దాని వలన వస్తుంది అనే సూచనలు, హెచ్చరికలూ వినిపిస్తుంటాయి. 

కాన్సర్ అంటే ఏమిటో తెలియనివారు ప్రపంచంలో చాలామంది ఉన్నారింకా.  అది తెలుసుకున్నంత మాత్రాన రాకుండా పోదు, తెలుసుకున్నవాళ్ళకి వస్తుందనీ కాదు కానీ కాన్సర్ గురించి అవగాహన పెంచుకుంటే కొద్దిలో కొద్దిగా జాగ్రత్తలు వహించవచ్చు.

మన శరీరంలోని జీవకణాలు పరస్పర సహకారంతో ఒకదానితో మరొకటి కలిసిమెలిసి బతుకుతుంటాయి.  ఒక జీవకణానికి అందిన పోషక పదార్థం దాని అవసరం మించి అందినప్పుడు దాని పక్కనున్న జీవకణానికి అందిస్తుంది.  అందుకే సరిపోను పోషక పదార్థాలుగల ఆహారం లభించనప్పుడు శరీరంలోని చివరి భాగాల మీద దాని ప్రభావం కనిపిస్తుంటుంది.  మన శరీరంలోని అంగాలన్నీ జీవకణాల సముదాయమే.  శరీరంలోని ఆ భాగం ఏ పని చెయ్యాలన్నది శరీర వ్యవస్థమీద ఆధారపడివుంటుంది కానీ ఆ పని చెయ్యటానికి కావలసిన శక్తి మాత్రం జీవకణాల ద్వారా సరఫరా అవుతుంది.  అలా శక్తి సరఫరా అవుతున్నంత కాలం ఆ శరీరభాగంలోని జీవకణాలు ఆరోగ్యంగా ఉంటాయి.  దానితోపాటుగా, కొత్త కణాలు ఉత్పత్తి అవటం, పాత కణాలు మృతి చెంది రక్తం ద్వారా బయటకు విసర్జించబడటం జరుగుతుంటుంది.  ఈ ఏర్పాటు కోసం జీవకణాలన్నీ ఒకదానికొకటి దగ్గరగా అంటుకుని ఉంటాయి. 

కాలం తీరిన తర్వాత కూడా ఏ కారణం చేతనైనా ఒక జీవకణం చనిపోవటానికి సిద్ధంగా లేనప్పుడు, అది శరీరానికి ఎందుకూ పనికిరాదు సరిగదా, అది అక్కడే ఉండిపోవటం వలన పోషక పదార్థాల సరఫరాకి ఆటంకం కలిగిస్తుంది.  మూసుకుపోయి ఉండటం వలన దానిలోపలికి పోషక పదార్థం ఎలాగూ పోలేదు.  అందువలన అది పనికిరాని, శరీరానికి సంబంధించని వస్తువైపోతుంది.  శరీరానికి సంబంధించని దాన్ని బయటకు తోసేసే ప్రయత్నం శరీర వ్యవస్థలో ఉంది కానీ మధ్యలో చావటానికి సిద్ధంగా లేని కణాన్ని, తీసివెయ్యటానికి శరీరంలో అదనంగా చోటెక్కడుంది.  అందువలన అది అక్కడ అలాగే ఉండిపోతుంది.  కణం ఆకారంలో ఉంటుంది కానీ జీవం లేకుండా ఉంటుంది.  అదే కాన్సర్ లేక ట్యూమర్. 

ఈ కాన్సర్ కణం స్థానంలో జీవకణం ఉన్నట్టయితే ఆహారాన్ని ఇతర జీవకణాలకు అందించేది.  కానీ ఇది ఆహారాన్ని తీసుకోవటం కానీ, ఇతర కణాలకు అందించటం కానీ చెయ్యదు.  దానివలన, ఆ కణం ఉన్న స్థానాన్నిబట్టి శరీరానికి నష్టమనేది ఉంటుంది.  కొన్ని కణాల వలన లాభం లేకపోయినా, నష్టమేమీ ఉండకపోవచ్చు కానీ కీలకమైన స్థానంలో ఉన్న జీవకణం ట్యూమర్ గా మారినట్లయితే అది మిగతా కణాలను కూడా నిర్వీర్యం చేస్తుంది.  దాన్నే కాన్సర్ వ్యాపించటం అంటారు.  అంటే మరికొన్ని జీవకణాలు కూడా ఈ శరీర వ్యవస్థ మీద చేసే సమ్మెలో భాగం వహించటం మొదలుపెడతాయి. 

శరీరంలోని ప్రతి భాగమూ జీవకణాల సముదాయమే కాబట్టి అవి ఒక నిర్మాణంలో ఇటుకల్లాంటివి.  ఏ ఇటుక లేక రాయి తొలగినా లేదా బలహీనమైనా, అది ఉన్న స్థానాన్నిబట్టి ఏ మేరకు ఆ నిర్మాణానికి నష్టం కలిగిస్తుందన్నది ఆధారపడివుంటుంది.

ప్లాస్టిక్ త్వరగా నశించదు.  భూమిలో కలిసిపోకుండా చాలా కాలం ఉండటం మనం చూస్తుంటాం.  అందుకే ఆహార పదార్థాలు నిలవుంచటం కానీ మరితర తినుబండారాలకు సంబంధించి చేసే దాని ఉపయోగం వలన కాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్తారు. 

కాన్సర్ అన్ని సందర్భాల్లోనూ ప్రాణాంతకం కాకపోవచ్చు.  కాన్సర్ అనేది శరీరంలో ఏ భాగంలోనైనా రావొచ్చు.  అది వచ్చినదాన్నిబట్టి, వ్యాపించే విధానాన్నిబట్టి శరీరనష్టం కలుగుతుంటుంది.  చురుగ్గా ఉండే భాగాల్లో కాన్సర్ రావటానికి తక్కువ అవకాశం ఉంటుంది.  ఆడవాళ్ళకి పిల్లలు పుట్టిన కొన్నాళ్ళకి బ్రెస్ట్ కాన్సర్ రావటానికి అవకాశం ఉంది.  అయితే, పెళ్ళి కాకుండా కూడా బ్రెస్ట్ కాన్సర్ వచ్చినవారున్నారు.  పొగాకు, గుట్ఖాల వినియోగం వలన గొంతు, రొమ్ము, ఊపిరితిత్తులలో నికోటిన్ వలన జీవకణాలు మాడిపోయే అవకాశం కూడా ఉంది.  అందుకే అవి కాన్సర్ కలిగించవచ్చని అంటారు.  ఇంతకాలం నుంచి వాడుతున్నా ఏమీ కాలేదు అంటే, వారి జీవన విధానంలో వారి శారీరక వ్యవస్థ ఆరోగ్యాన్నిపరిరక్షించుకుంటూ ఉండవచ్చు కానీ ఎప్పుడైనా కాన్సర్ రావచ్చు కాబట్టి కాన్సర్ కలుగజేసే పదార్ధాల వినియోగాన్ని మానుకోమని డాక్టర్లు సలహా ఇస్తారు. 

ఒక్కోసారి చెడిపోయిన జీవకణాల సముదాయాన్ని అక్కడి నుంచి తొలగించటం వలన కూడా కాన్సర్ ని పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి సర్జరీ ద్వారా తొలగిస్తుంటారు.  కానీ అదే అలవాట్లు అదే శరీర వ్యవస్థ కాబట్టి మరోసారి అదే ప్రాంతంలో కాన్సర్ తలెత్తవచ్చు.  తొలగించే ముందు కాన్సర్ ఎంత వరకూ వ్యాపించిందన్నది నిర్థారిస్తారు. 

ఒక్కోసారి ప్రధానాంగాల్లో కూడా ట్యూమర్ మొలకెత్తవచ్చు.  కాలేయం, ప్రోస్టేట్, పాంక్రియాస్ ఇలాంటివాటిలో కాన్సర్ సంభవిస్తే ప్రాణాంతకమే అవుతుంది.  వాటిని తొలగించటం కష్టం కనుక.  ఆడవాళ్ళకి వచ్చే బ్రెస్ట్ కాన్సర్ ని, బ్రెస్ట్ తొలగించటం వలన ప్రాణాలు నిలబడ్డ ఉదంతాలే ఎక్కువగా ఉన్నాయి.  అలాగే గొంతులో అయిన కాన్సర్ వలన శస్త్ర చికిత్సతో నయం చేసినా స్వరపేటిక దెబ్బతిని స్వరం పోయినవారున్నారు.  ఏ నష్టమూ లేకుండా మామూలుగా అయిపోయినవారూ ఉన్నారు.  ప్రధానాంగాలే కాకుండా రక్తంలోని రక్తకణాల్లోనే గనక కాన్సర్ వస్తే, దాన్నే బ్లడ్ కాన్సర్ అంటారు- అన్ని అంగాలకూ శక్తిని సరఫరా చేసేది రక్తం కాబట్టి ప్రాణాంతకమౌతుంది.  రక్తం ఎప్పుడూ శరీరమంతా తిరుగుతూ ఉంటుంది కాబట్టి సర్జరీ ద్వారా తొలగించేది కాదది. 

కాన్సర్ సోకిన తర్వాత వైద్యం అవసరమే కానీ, కాన్సర్ రాకుండా చేసుకోవటానికి ఈ జాగ్రత్తలు పనికివస్తాయి- 1.  ఆహార నియమాలు.  2. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటం.  3. శరీరానికి తగిన వ్యాయామం.

జీవకణాలన్నీ ఎప్పుడూ చైతన్యంగా ఉండటానికి మామూలు వ్యాయామం సరిపోదు.  వ్యాయామం వలన శరీరంలోని మలినం బయటకు పోతుంది, కొవ్వు పదార్థం కరిగిపోతుంది కానీ శరీరభాగాల లోపలున్న జీవకణాలలో మార్పు రాదు.  జీవకణాలను ఉత్తేజంగానూ చైతన్యంగానూ ఉంచుకోవటానికి యోగాసనాలు, ప్రాణాయామం బాగా పనికివస్తాయి.  ప్రాణాయామంలో ముఖ్యంగా జరిగేది ప్రాణ శక్తి సంచాలనం.  అందువలన అన్ని జీవకణాలూ వికసించటం మొదులపెడతాయి. 

చాలామందికి తెలియనిది మరో రహస్యం ఉంది.  జీవకణాలు శక్తిని ఇచ్చి పుచ్చుకోవటమే కాకుండా భావోద్రేకాలను కూడా పంచుకుంటాయి.  దుఖ్ఖంలో ఉన్నప్పుడు కొన్ని శరీరభాగాలకు నష్టం కలగటానికి అదే కారణం.  అలాగే ఆనందాన్ని కూడా పంచుకుంటాయి.  ఆకలిగా ఉన్నప్పుడు రుచికరమైన భోజనం చేసిన సమయంలో శరీరంలోని జీవకణాలన్నీ ఆనందంతో పులకిస్తాయి.  శృంగారక్రీడ తర్వాత కూడా జీవకణాలన్నీ ఆనందంతో పరవశించిపోతాయి.  అందుకే బిజినెస్ మీటింగ్ లు భోజనంతో ముడిపెట్టటం జరుగుతుంది.  మిత్రులు, బంధువులు, ప్రేమికులు తింటూ తాగుతూ ఇచ్చకాలాడుకుంటుంటారు.  ఆకలిగా ఉన్నవాడికి తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత అతను సంతృప్తితో మనసారా చేసే దీవెనలు ఫలిస్తాయి. 

అలాగే శృంగారవేళల్లోనే మాట ఇవ్వటం, వరాలడగటం ఉంటుంది.  బందిఖానాలో ఉన్న భక్త రామదాసు రాముడిని వేడుకుని వేడుకుని విసిగిపోయి సీతమ్మను వేడుకోవటం మొదలు పెడతాడు.  తన గురించి రాముడికి ఏ సమయంలో నివేదించాలో సీతమ్మకు చెప్తాడు రామదాసు. 

ప్రాణాయామం, పరిశుభ్రమైన ఆహారంతో పాటుగా మనసుని ఆహ్లాదంగా ఉంచుకున్నప్పుడు కూడా జీవకణాలన్నీ చైతన్యంగా ఉండి కాన్సర్ అవకాశాలను బాగా తగ్గిస్తాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  More time watching tv
Chidambaram says govt did not ask rushdie not to visit india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles