Ak khan

Hyderabad police commissioner ak khan told reporters about high tech cheeting

Hyderabad police commissioner ak khan

18.gif

Posted: 01/22/2012 05:29 PM IST
Ak khan

17 ఇటీవల కాలంలో వెలుగు చూస్తోన్న మోసాల పరంపర చూస్తుంటే వామ్మో అనిపించక మానదు. ఒకదానికి మించిన మరో ఎత్తుగడలతో మొసగాళ్లు కొత్తపుంతలు తొక్కుతున్నారు. దోపిడీలు దొంగతనాలకు ధీటుగా వైట్ కాలర్ నేరాలు అధికమవుతున్నాయి. ఇదే తరహాలో విస్తుగొలిపే సంఘటన ఒకటి ఎట్టకేలకు బట్టబయలైంది.

క్రెడిట్ కార్డులతో బ్యాంకులను బురిడీ కొట్టించింది ఒక ముఠా. తాము సాఫ్ట్ వేర్ సంస్థలు నిర్వహిస్తున్నట్లు నమ్మించి, క్రెడిట్ కార్డులు పొంది ఒక కోటీ ఏడు లక్షల రూపాయలమేర బ్యాంకులను బురిడీ కొట్టించిన ఘరానా మోసగాళ్ల గుట్టు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విప్పారు.

అడ్రాయిట్, అలయిట్ పేర్లతో బోగస్ సంస్థలు ఏర్పాటు చేశారో మాయగాళ్లు. తమ సంస్థలో ఉద్యోగులు పనిచేస్తున్నట్టు నమ్మించి వారి పేరుతో నియామక పత్రాలు స్రుష్టించారు. అంతేకాదు మరోఅడుగు ముందుకేసి ఉద్యోగుల పేరుమీద బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆ తర్వాత వారి పేరు మీద క్రెడిట్ కార్డులు కోసం దరఖాస్తు చేశారు. ఇవన్నీ నిజమని నమ్మిన పలు బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేశాయి.

తద్వారా మంజూరైన క్రెడిట్ కార్డులతో ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు జరిపారు.ఇలా నిందితులు కోటీ ఏడు లక్షల రూపాయల మేర మోసాలకు తెగబడ్డారు. వీరి నుంచి 21 మొబైల్ ఫోన్లు, 82 సిమ్ కార్డులు, 60 లక్షల సొమ్ము స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎకె ఖాన్ వెల్లడించారు.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy
Republic day security  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles