Value added tax

value added tax agitation in entire andhra pradesh

value added tax agitation

13.gif

Posted: 01/21/2012 06:11 PM IST
Value added tax

13రాష్ట్రంలో వస్త్రవ్యాపారులు కథం తొక్కారు. వస్త్రాలపై విధించే వ్యాట్ కు నిరసనగా వ్యాపారాలు బంద్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 23 నుంచి 31 వరకూ రాష్ట్రంలో అన్ని వస్త్రవ్యాపార దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వస్త్రవ్యాపారుల దుకాణాల సంఘం నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు.

          బంద్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ఇందిరా చౌక్ వద్ద 9 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యాట్ ఎత్తివేయాలని లేకుంటే తమ నిరసన మరింత ఉధృతం  చేస్తామని హెచ్చరించారు. ఫలితంగా ఎల్లుండి నుంచి అంటే సోమవారం మొదలుకొని తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బట్టల షాపులు బంద్ అన్నమాట.

          వ్యాపారులకు సంఘీభావం తెలుపుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళే నిర్ణయించిన నేపథ్యంలో వస్త్రవ్యాపారులకు కొండంత అండ దొరికినట్లైంది. ఇప్పటికే వామపక్షాలు వ్యాట్ తొలగించాలంటూ తమ గళాన్ని వినిపిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారస్తుల కోరిక ఏమేరకు సఫలమవుతుందో వేచిచూడాలి.

                                                                                                                   ...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana political jac chairmen prof kodandaram
Kishan ji  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles