"నేను చనిపోయిన తర్వాత నా విగ్రహం పెట్టకండ"ని ఆఖరి క్షణాల్లో తన కోరికను వెలిబుచ్చాడట ఓ నాయకుడు. "ఎందుకు?" అని అడిగితే, "దాని మీద ముఖ్యంగా తలమీద కాకులు వాలి, మలినం చేస్తాయి" అని అన్నాడట.
నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైయస్ ఆర్ విగ్రహాల మీద వ్యాఖ్యానం చేసారు. అనుమతులు లేని విగ్రహాలను పడగొట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. అది జరగకపోతే లక్ష ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టిస్తామని ఆయన అన్నారు. అయితే పార్లమెంటులో ప్రతిష్టించవలసిన ఎన్టీఆర్ విగ్రహం వర్గపోరాటం వల్లనే ఇంతవరకూ జరగకుండా నిలిచిపోయిందని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు.
విగ్రహ ప్రతిష్ట చెయ్యటానికి ప్రభుత్వ అనుమతులు అవసరమే. కానీ ఈ మధ్యకాలంలో అనుమతుల జోలికి పోకుండా విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నాయి. ఎక్కడ విగ్రహాలను ప్రతిష్టించినా వాటిని వారి అభిమానులు చేరి వాటిని అక్కడ నిలబెట్టినట్టుగా చెప్పినా, ఆ విగ్రహాల వెనుక రాజకీయాంశాలు చోటుచేసుకుంటాయన్నది అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఆ నాయకుడి పేరుతో రాజకీయ లబ్ధి కోసమే విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఆ విగ్రహ ప్రతిష్ట వలన పార్టీ ప్రతిష్ట ను అది కొన్నాళ్ళు నిలబెడుతుందని పార్టీల ఆశాభావం. ఎంత అందరికీ తెలిసిన ఉత్పాదనైనా, అది వినియోగదారులు మదిలోంది తొలగిపోకుండా ఉండటం కోసం అందరూ చూసేచోట పెద్ద పెద్ద హోర్డింగ్స్ రూపంలో వ్యాపార ప్రకటనలు ఎలా చేస్తారో అలాగే, రాజకీయ నాయకుల మీద ప్రజల కున్న అభిమానం అణగారిపోకుండా ఉండటం కోసం వారి విగ్రహాలను ప్రతిష్టించటం జరుగుతోంది.
ఇదే పంథాలో ఉత్తర ప్రదేశ్ లో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి మాయావతి విగ్రహాలు, ఆమె పార్టీ బిఎస్పీ ఎన్నికల చిహ్నమైన ఏనుగలు విగ్రహాలు కూడా భారీగానూ, విరివిగా నూ ప్రతిష్టించబడ్డాయి. అందువలన వాటిమీద ముసుగు కప్పమని ఎన్నికల అధికారి ఆదేశాలు కూడా అమలు జరిగాయి.
ట్యాంక్ బండ్ సుందరీకరణలో భాగంగా విగ్రహ ప్రతిష్టలు కూడా చెయ్యాలనుకున్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తన పార్టీ ప్రతిష్టను ఇనుమడించేవి కాకుండా తెలుగు సంస్కృతికి అద్దం పట్టే విగ్రహాలను ప్రతిష్టించాలని కోరుకోవటం ముదావహమే కానీ, ఆ సమయంలో తెలుగు దేశం పార్టీ వయసే చాలా తక్కువ. ఇక అందులో ప్రతిష్టను పెంచే నాయకులెవరున్నారప్పుడు. అయితే కొన్ని విగ్రహాల్లో ఎన్టీఆర్ ముఖకవళికలు కనిపిస్తున్నాయని కొందరు ఆరోపించారు. కానీ బుద్ధ విగ్రహాన్ని తప్పు పట్టటానికి లేదు. దానివలన రాజకీయ లబ్ధి కలిగిందని ఆరోపించటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిలాగా తను జీవించినప్పుడే తన సొంత విగ్రహాలను ప్రతిష్టించుకునే స్థాయికి ఎన్టీఆర్ దిగజారలేదు. అయినా టాంక్ బండ్ మీద కొన్ని విగ్రహాలు ఉండటం, కొన్ని లేకపోవటం తెలంగాణా వాదులకు ఆగ్రహాన్ని తెప్పించి ధ్వంసానికి పూనుకునేట్టుగా చేసింది.
నాయకుల విగ్రహా ప్రతిష్టల వలన ప్రతిష్ట పెరగటమేమో కానీ పాలకవర్గానికి చికాకులు ఎదురవటం కూడా జరుగుతుంది. ఏ రోడ్డు విస్తరణ కోసమో, లేదా మరేదైనా ప్రజా ప్రయోజనం కోసమో ఆ విగ్రహాన్ని తొలగించవలసి వస్తే ఆ పని వారికి చాలా కష్టమౌతుంది. ఎన్నో నిరసనలు, ఆందోళనలు చెలరేగుతాయి. ఒకప్పుడు ఎక్కడ బడితే అక్కడ చిన్న చిన్న గుడులు కట్టి ట్రాఫిక్ కి ఇబ్బందులు కలిగించేవారు. వాటి స్థానంలో ఇప్పుడు విగ్రహాలు వస్తున్నాయి. విగ్రహాలు, స్థూపాలు, జెండాలు చూసి ఎవరూ ఓటెయ్యరు అని ఒక నాయకుడు అన్నారు. అవి చూసి వేస్తారని కాదు కానీ, వారి మదిలో ఆ నాయకులమీద అభిమానం చెరిగిపోకుండా ఉండటం కోసమే ఆ ప్రయత్నం. ఆ అభిమానమే లేనివారి ఇంటి ముందు విగ్రహాన్ని ఉంచినా ఏమీ తేడా ఉండబోదు.
ప్రాచీన శోభలను వెదజల్లే విగ్రహాలను ధ్వంసం చేసిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలోనీ అతి ఎత్తైన విగ్రహాలలో ఒకటి ఈజిప్ట్ లో గిజాలోని స్ఫింక్స్. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలో నిర్మించబడిందని చరిత్రకారులంటారు. హిందూ దేవుళ్ళో నరసింహావతారంలో మానవ శరీరానికి సింహం తల ఉంటే, ఈ స్ఫింక్స్ కి సింహం శరీరానికి మానవ శిరస్సు ఉంటుంది. కింగ్ కాఫ్రే పిరమిడ్ కి సమీపంలో ఉన్న ఈ విగ్రహం ఎత్తు 65 అడుగులు, కింద భాగంలో పొడవు 241 అడుగులు, వెడల్పు 20 అడుగులు.
ప్రపంచంలోని అతి ఎత్తైన విగ్రహాల్లో మరొకటి కోర్కావిడో పర్వతం అంచున ఉన్న ఎత్తు 130 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహం. ఇది 1931 లో ప్రతిష్టించబడింది.
అమెరికా లోని లిబర్టీ విగ్రహం ఎత్తు 151 అడుగులు. ఇది 1886 లో నిర్మించబడింది. ఇది అమెరికన్ దేశస్తులకు ఫ్రాన్స్ వారి బహుమానం.
మరో పెద్ద విగ్రహం 174 అడుగుల ఎత్తైన బామ్యన్ బుద్ధా. ఇది ఆఫ్ఘనిస్తాన్ లో బామ్యన్ లోయలో ఉండేది. దీన్ని తాలిబాన్లు ధ్వంసం చేసారు.
రష్యాలోని మామాయేవ్ కుర్గన్ లోని మదర్ మదరే ల్యాండ్ విగ్రహం ఎత్తు 279 అడుగులు. ఇదే ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన విగ్రహం. ఇది 1960 లో ప్రతిష్టించబడింది.
ప్రపంచంలోని ఈ విగ్రహాలు, మరికొన్ని విగ్రహాల గురించి తెలుసుకుంటే మనమెక్కడున్నాం, మన ఆలోచన పరిధి ఎంతవరకూ ఉందన్నది తెలుస్తుందనే వీటి ప్రస్తావన తీసుకునిరావటం జరిగింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more