Chandrababu and moulana hasan islamicentre patabasti

chandrababu and moulana hasan IslamiCentre Patabasti, Telugu desam party Cheif Leader Chandra babu,

chandrababu and moulana hasan IslamiCentre Patabastiin Hyderabad

Islami.gif

Posted: 01/17/2012 04:48 PM IST
Chandrababu and moulana hasan islamicentre patabasti

chandrababu and moulana hasan IslamiCentre Patabasti

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పాతబస్తీలో ముస్లింల నుంచి నిరసన ఎదురైంది. దీంతో ఆయన ‘సున్నీ దావత్-ఏ-ఇస్లామీ’ ఆధ్వర్యంలో రెండు రోజులుగా మీరాలం ఈద్గాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సమావేశాల్లో ప్రసంగించకుండానే వెనుదిరిగారు. ‘సున్నీ దావత్-ఏ- ఇస్లామీ’ నిర్వహించిన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జరిగిన సభకు భారీ సంఖ్యలో పురుషులు, ముస్లిం మతపెద్దలతోపాటు చంద్రబాబునాయుడు కూడా హాజరయ్యారు.

‘సున్నీ దావత్-ఏ-ఇస్లామీ’ అఖిల భారత అధ్యక్షుడు మౌలానా మహ్మద్ షకీర్ అలీ నూరీ ముంబాయి, రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా హస్సన్ ఫారుఖీ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు మాట్లాడతారని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో సభకు హాజరైన ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ రాజకీయాలు వద్దు, చంద్రబాబు ‘గో బ్యాక్... గో బ్యాక్ ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆయన కంగుతిన్నారు. పలుమార్లు మత పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ముస్లిం యువకులంతా లేచి ఆయనకు వ్యతిరేకంగా ‘నారే తక్బీర్’, ‘అల్లాహో అక్బర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన మత పెద్దలు ఆయన ప్రసంగించడానికి రాలేదని కేవలం దువా (ఆశీస్సులు) తీసుకోవడానికి మాత్రమే వచ్చారని ప్రకటించి అక్కడకు వచ్చినవారిని శాంతింపచేశారు. ఊహించని విధంగా ముస్లింలనుంచి నిరసన ఎదురుకావటంతో బాబు వెనుతిరగక తప్పలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  People can meet him every day from 3 pm to 4 pm at his office
Sonia gandhi asks uttarakhand people to oust bjp from the state  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles