ఎన్నికల సమయానికి పార్టీలను బలోపేతం చేసుకోవటంలో పార్టీలోకి జనాకర్షణగల ముఖాలను తీసుకుని రావటం కూడా భాగమైపోయింది. ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో అమేథీకి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక వెళ్ళారు. అక్కడి పార్టీ కార్యకర్తలతో సమావేశమై ప్రచార కార్యక్రమాన్ని రూపొందించుకుంటారు.
ప్రియంకను పార్టీ క్రియాశీలక కార్యకలాపాలలోకి దింపాలని కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎప్పటినుంచో సూచిస్తున్నారు. దానివలన ఒకటి, నెహ్రూ కుటుంబీకుల మీదున్న అభిమానం, రెండవది మహిళ అవటం, మూడవది ఆమె ఇందిరా గాంధీని గుర్తుచెయ్యటం జరుగుతుంది. దాని వలన ప్రజాకర్షణ పెరిగే అవకాశం మెండుగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాల నమ్మకం.
నిజంగా జనాకర్షణ పనిచేస్తుందా అంటే చేస్తుందనే చెప్పుకోవాలి. కానీ ఎన్నికల సమయంలో వచ్చే జనం నిజంగా ఆ పార్టీకి అంత మద్దతునిస్తారా అంటే కేవలం వారి రాక వల్లనే అది సాధ్యం కాదని గతంలో ఎన్నో సందర్భాల్లో ఋజువైంది. అంటే అది కూడా దోహదం చేస్తుందేమో కానీ అదొక్కటే చాలదన్న మాట. కానీ దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ పార్టీలో ఆకర్షణీయమైన వ్యక్తుల ప్రమేయం కోసం వెంపర్లాడటం కద్దు.
తెలుగు దేశం పార్టీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడూ జనం వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సందర్భంలో చిరంజీవిని చూడటానికి లక్షలాదిగా తరలి వచ్చారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నప్పుడు ఆంధ్రా లోనే కాకుండా కర్నాటకలో కూడా విపరీతంగా జనం విచ్చేసారు. అలాగే రాహుల్ గాంధీ మొదటిసారిగా బయటకు వచ్చినప్పుడు కూడా జనాదరణ బాగానే కనపడింది. కానీ అది వాళ్ళని చూడటం వరకే పరిమితమైంది. ఎన్నికల ఫలితంలో దాని ప్రభావం ఉంటుందా అంటే లేదని కొట్టిపారెయ్యటానికీ వీలు లేదు. అయితే దానితోపాటు మిగతా అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి.
అయితే వినేవాళ్ళుంటేనే కదా చెప్పేవాళ్ళకి చెప్పే అవకాశం దొరికేది. అందుకే జనాకర్షణ కూడా పార్టీ చెప్పదలచుకున్నవి చెప్పటానికి, ఎక్కువ మందికి చేరవేయటానికి పనికివస్తుందని రాజకీయ నాయకుల నమ్మకం. ఇప్పుడు టివిలు ఇన్నిన్ని ఛానెల్స్ తో కవర్ చేస్తున్న తరుణంలో టివి లోచెప్తే చాలుగా అనేవారూ ఉన్నారు. కానీ ఒక సందర్భాన్ని తయారుచేసుకుని జనం మధ్యలోకి పోయి చెప్పేది నాలుగు ముక్కలైనా దానికెంతో విలువుంటుంది, టివి ఛానెల్స్ కూడా వాటిని బాగా కవర్ చేస్తాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more