Ra issued notification

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

RA issued notification.gif

Posted: 12/20/2011 06:09 PM IST
Ra issued notification

రాష్ట్ర పోలీసుల నుంచి 'రా' వరకూ ఎవరైనా ఇకపై మీ ఫోన్లను ట్యాప్ చేయవచ్చు. మీకు తెలియకుండానే మీ ఈ మెయిల్స్‌ను చెక్ చేయవచ్చు. అది కూడా అధికారికంగానే! ఫోన్ ట్యాపింగ్‌పై ఇప్పటికే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో.. అధికారికంగానే ట్యాపింగ్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత నిఘా సంస్థ రిసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా)కు మరిన్ని కోరలు తొడగడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్జాతీయ గూఢచార సంస్థలతో సమానంగా 'రా'కూ రహస్య విచారణకు అధికారాలు కల్పించింది. 'దేశీయం'గా ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్, వాయిస్, డాటా సంభాషణలు, సమాచారాన్ని రహస్యంగా వినేందుకు, పరిశీలించేందుకు మరో ఎనిమిది సంస్థలతో కలిసి 'రా'కు అధికారాలు కల్పించింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ టెక్నికల్ రిసెర్చి ఆర్గనైజేషన్‌లతోపాటు రాష్ట్ర పోలీసులకూ ఫోన్ ట్యాపింగ్ అధికారాలు ఉండగా.. తాజాగా 'రా'కు వీటిని దఖలు పరుస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Exminister son among 3 killed in accident
India visa for online  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles