Reddy says vizag not safe for purandeswari

The Andhra Pradesh Congress may be in for more tussle as T S Reddy wants to fight the Lok Sabha election from Visakhapatanam but the sitting MP is not

The Andhra Pradesh Congress may be in for more tussle as T S Reddy wants to fight the Lok Sabha election from Visakhapatanam but the sitting MP is not

Reddy says Vizag not safe for Purandeswari.gif

Posted: 12/20/2011 09:59 AM IST
Reddy says vizag not safe for purandeswari

T.subbiramireddyరాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి కేంద్రమంత్రి పురందేశ్వరి సీటుకు ఎసరు పెడుతున్నాడా ? ఆమెను ప్రస్తుతస్థానం నుండి ఎలాగైనా విశాఖపట్నం నుంచి తప్పించాలని గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పురందేశ్వరి వచ్చేసారి నరసరావు పేట నుంచి పోటీచేయడం మంచిదని, ఆమెకు ఆ సీటు సురక్షితమైన సీటు అని సుబ్బరామిరెడ్డి సలహా ఇస్తున్నారు.

వచ్చే ఎన్నికలలో తాను విశాఖ నుంచి పోటీచేయాలని భావిస్తున్నట్లు కూడా ప్రకటించారు. తదనుగుణంగా ఆయన స్థానికంగాను, డిల్లీ స్థాయిలోను పావులు కదుపుతున్నారు. కాని పురందేశ్వరి మాత్రం తన మనసులో మాట బయటపడనీయకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైతే విశాఖ పట్నం నుంచి పోటీచేయడానికే మొగ్గు చూపుతుండవచ్చు. ఒక వేళ తప్పనిసరి పరిస్థితి వస్తే నరసరావు పేట నుంచి కూడా పోటీచేయడానికి ఆమె వెనుకాడకపోవచ్చు. తొలిసారి బాపట్ల నుంచి, రెండోసారి విశాఖ నుంచి పోటీచేసి విజయం సాధించిన పురందేశ్వరి కేంద్రమంత్రిగా సమర్ధంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎక్కడా వివాదాస్పదం కాకుండా వ్యవహరిస్తున్నారు.ప్రదాని మన్మోహన్ సింగ్ తో సహా పలువురు ప్రముఖుల మన్ననలను ఆమె పొందారు. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణిగా, ఎన్.టి.ఆర్.కుమార్తెగా అందరికి తెలిసిన పురందేశ్వరి అనూహ్య పరిణామాలలో రాజకీయాలలోకి వచ్చారు.మరి వచ్చేసారి ఆమె విశాఖ నుంచి పోటీలో ఉంటారా?లేక నరసరావుపేటకు వెళతారా అన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Agitation in araku valley against experts committe study on bauxite
35 year old woman enters sabarimala temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles