Ban on iskon bhagavadgita is in russian courts

ban on iskon bhagavadgita is in russian courts, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

bhagavad-gita1.gif

Posted: 12/19/2011 05:00 PM IST
Ban on iskon bhagavadgita is in russian courts

bhagavad-gitaహిందువులకు పవిత్ర గ్రంధమైన భగవద్గీతను తిరగరాసిన ఇస్కాన్ ఆధ్యాత్మిక సంస్థాపకుడు స్వామి ప్రభుపాద పుస్తక రష్యన్ భాషానువాదాన్ని బహిష్కరించటానికి రష్యన్ కోర్టు సిద్ధమవుతున్న తరుణంలో అక్కడ నివసించే హిందువులు, ఇస్కాన్ సభ్యులు ఆందోళన చెందటం సహజమే, వారికి మద్దతుగా భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ దురాగతాన్ని నిలిపి వేయటానికి దౌత్య సంబంధాలనుపయోగించమని కోరటమూ సహజమే కానీ, దీని మీద మన దేశంలో దుమారం రేగటమెందుకన్నది అంత త్వరగా అంతుబట్టే విషయమైతే కాదు.  భగవద్గీత మీద వ్యాఖ్యానాన్ని అందులోనూ రష్యన్ భాషలో అనువదించినదాన్ని రష్యన్ భూభాగంలో నిషేధించటాన్ని తప్పు పట్టటానికేముంది.  వారేమైనా వేదవ్యాసుడు రచించిన భగవద్గీతను కాదంటున్నారా.  ఒకవేళ అన్నా మనకెలా వర్తిస్తుందది. 

యూరప్ లో హిందూ దేవీదేవతలను పరిహసిస్తూ లో దుస్తుల మీద, చెప్పుల మీద బాత్ రూం లలో ఉపయోగించటాన్ని సహించలేమంటే కాస్త అర్థముంది.  కానీ రష్యాలో వారి రాజకీయ నమ్మకాలకు వ్యతిరేకంగా కనిపించిన అంశంతో వారు ప్రభుపాద రష్యన్ కృతి భగవద్గీత యాజ్ ఇటీజ్ ని  నిషేధిస్తే మన దేశంలో పార్లమెంటు ఎందుకు స్తంభించాలన్నది చాలా మందికి అర్థం కాని విషయం.  దౌత్య సంబంధాలనుపయోగించి, అక్కడి మన దేశ ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే ప్రభుత్వం తగు రీతిలో కలుగజేసుకుంటుంది.  కానీ శీతాకాలం సమావేశాలు అంతం కావస్తున్నా మొదటి నుంచీ గందరగోళంలో సాగిన (సాగని) సభలు ఈ రోజు కూడా అలాగే ప్రవర్తించటం శోచనీయం.  చర్చనీయాంశాలను పార్లమెంటులో ప్రవేశపెట్టటానికి, వాటిని చర్చించటానికి, అత్యవసర పరిస్థితుల్లో తాజా విషయాలను కూడా ప్రవేశపెట్టటానికి ఒక నిర్దుష్టమైన పద్ధతి అనుసరణీయమైన విధానం ఉన్నప్పుడు ప్రతిరోజూ ఒక సమస్యను లేవనెత్తి పార్లమెంటుని సజావుగా సాగనివ్వకపోవటం వలన  చర్చలు ఎలా సాగుతాయి, చట్టాలు ఎలా రూపొందుతాయి.  

ప్రజాప్రతినిధులుగా, ప్రతిపక్షంగా వారికున్న చొరవ, హక్కులను ఉపయోగించుకోవటంలో తప్పు లేదు కానీ పార్లమెంటే సాగకపోతే ప్రజాప్రతినిధులు ఎక్కడ చర్చిస్తారు, ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా అమలుజరుగుతాయి.  ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెప్తారు.  పాలక పక్షం, ప్రతి పక్షం ఒకరి మీదొకరు వేసుకోవటం తప్ప ఏమీ జరగదు.  చివరకు సమావేశాల సమయం అయిపోతుంది, ఏ చర్చా జరగదు, ఏ బిల్లూ పాసవదు కానీ వాదోపోవాదాలు మిగిలిపోతాయి, మీడియాల్లో ప్రకటనలు తప్ప మరేమీ ఉండదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Center ministers meet to night to discuss lokpal
Wine syndicates involve officials and leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles