అసలు చంపటమే నేరమైనప్పుడు వారిని ముస్లింపద్ధతిలో 'హలాల్' చేసారా లేకపోతే పంజాబీ సిక్కుల పద్ధతిలో 'ఝట్కా' చేసారా అన్నది అర్థం లేని వాదం. మద్యపానమే సంఘంలో పట్టిన చీడ, మధ్య, కింది శ్రేణి తరగతి కుటంబాల పాలిట శాపంగా భావిస్తుంటే అందులో ఇంతకమ్మారు, అంతకమ్మారు కూడానా అంటే, అది చట్ట పరిధిలోని వివాదం. ఒక ప్రాంతంలో మద్య నిషేధం ఉన్నప్పుడు మద్యపానం క్రయవిక్యాలు జరిగితే అది నేరం. అదే ప్రాంతంల నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు అది న్యాయబద్ధం.
డొక్కాడకపోయినా పరవాలేదు కానీ చుక్కపడకపోతేనే కానీ రోజు పూర్తైనట్టు కాని ప్రజానీకం బలహీనతను ఆధారంగా చేసుకుని, కొందరు బడాబాబులు మందుబాబులను దోచుకుంటున్నారు. అవినీతికి ఎక్కడ ఏమాత్రం సందు దొరికినా వదలని నాయకులకు ఈ వ్యసనానికి బానిసలైన అధిక సంఖ్యాకులకు నిత్యావసరంగా మారిపోయిన తాగుడు కాసులను నింపేందుకు మార్గంగా కనిపించింది. ఇంకేముంది, రంగం సిద్ధమైంది. సీసా మీదున్న గరిష్ట ధరకి ఎక్కువగా తీసుకుంటున్నా ఎందుకని అడిగే నాథుడు లేడు. అవసరం అలాంటిది. ఎవరైనా ధైర్యం చేసి అడిగితే, అదంతా కావాలంటే తీసుకో లేకపోతే పొమ్మంటారు. అలవాటు పడ్డ ప్రాణాలు నరాలను తోడేస్తుంటే వాటి బాధను ఉపశమనం చెయ్యటానికి అధిక ధరలకే కొంటున్నారు. ఇది చాలా జిల్లాల్లో చాలా కాలంగా సాగుతున్న తంతు.
అదంతా సులభంగా చెయ్యగలిగింది కాదు. దీనికోసం ముందుగా దుకాణదారులంతా సిండికేటై ధరలను నిర్ణయించుకోవాలి. అందులో అధికారులందరికీ చేతులు తడపాలి. అందులోని వాటా నాయకులదాకా పోతుంది. అప్పుడే ఈ దందా కొన్నాళ్ళు నిలదొక్కుకుంటుంది. ఇవన్నీ కాకుండా తాగటం సులభతరం చెయ్యాలి. అక్కడే కొనుక్కుని అక్కడే నిలబడి తాగెయ్యటం వలన బార్ వరకూ పోవలసిన అవసరం, అక్కడ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవసరం పడకుండా దుకాణం దగ్గరే తాగేస్తుంటే దానికి మద్దతుగా డిస్పోజబుల్ గ్లాసులు, నీళ్ళప్యాకెట్లు, సోడా, మిక్చర్ ప్యాకెట్లు కూడా అక్కడే లభిస్తాయి. దానితో విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్కడే తాగి, అక్కడే డోక్కుంటున్న సన్నివేశాలు సర్వసాధారణాలే కానీ ఎవరూ దీనికి అభ్యంతరం తెలపలేకపోతున్నారు. స్థానికి పోలిసులు, ఎక్సైజ్ అధికారులు, ఇంకా ఛోటా బడా నాయకులకు ముడుపులు సకాలంలో ఒప్పందం ప్రకారం అందుతున్నంతకాలం ఈ దంధాకి ఢోకా లేదు.
అయితే అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తణిఖీల్లో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. వారి దగ్గర ఉన్న పుస్తకాల్లో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారన్నది రాసి పెట్టుంది. వాటిని ఏసిబి వారు తీసుకుని వెళ్ళారు. ఈ విషయం మీద స్పందిస్తూ, ఎసిబి వారు ఆ నాయకుల పేర్లను బహిర్గతం చెయ్యాలని, ఆ నాయకులను పదవుల్లోంచి తొలగించాలంటూ తెదేపా నాయకులు అక్కడక్కడా ఆందోళన సాగించి పట్టుబడుతున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more