"మా తండ్రిగారు నన్ను అనాథగా వదిలిపెట్టి పోలేదు. నాకో పెద్ద కుటుంబాన్నిచ్చిపోయారు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం" అని అన్నప్పుడు దానికి సమాధానంగా గుమిగూడిన అశేష ప్రజానీకంలోంచి కేరింతలు వినిపించాయి. ఇది జగన్ ఓదార్పు యాత్రలో జరిగిన సంఘటన. 2003లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తన 1400 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసిన శ్రీకాకుళం లోని సన్నివేశమిది. ఇది జరిగింది జూలై 2010లో.
వైయస్ఆర్ ఆకస్మిక మరణంతో వేదన చెంది మృతి చెందిన కుటుంబీకులను ఓదార్చేందుకు అతని కుమారుడు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ యాత్రలను మానుకోమని రెండుసార్లు హెచ్చరించారు. అయినా జగన్ వినలేదు. వినవలసిన అవసరం కూడా అతనికి లేదు. తండ్రి మరణం తర్వాత ఆయన స్మృతిలో ఏం చేసుకుంటారన్నది జగన్ ఇష్టం. చట్ట విరుద్ధమైన పని కానంత వరకూ, ఎవరికీ ఇబ్బంది కలగనంత వరకూ ఆ పనిలో అభ్యంతరాలు తెలపవలసిన అవసరం ఏముంటుంది. ఎవరికి ఇబ్బంది కలుగుతోంది. జగన్ కి ఈ యాత్రల వలన ప్రజామోదం, మద్దతు లభిస్తుందేమో అని భయపడేవారికే ఇబ్బంది కలిగించింది కానీ వేరెవరికీ కాదు.
అందువలన రాజకీయ నేతలంతా ఏక కంఠంతో "ఫౌల్" అని అరిచారు. జగన్ యాత్రలో పాల్గొనవద్దని కాంగ్రస్ నేతలకు రోశయ్య పిలుపునిచ్చారు. లక్ష్మణ రేఖ దాటుతున్నావ్ అని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్పి గర్జించారు. అంతకంటే ఘోరమైన విషయమేమిటంటే ఓదార్పు యాత్ర లక్ష్యాన్నే కించపరుస్తూ, ఓదార్చవలసిన కుటుంబీకులనందరినీ ఒకచోటికి పిలిచి వారికి చెయ్యదలచుకున్న ఆర్థిక సాయాన్ని ముట్టజెప్పవచ్చు గదా అని జగన్ కి సూచించారు. రాజకీయ పొరలు కప్పినవారికి ఎవరేం చేసినా రాజకీయం లాగానే కనిపిస్తుందనటానికి ఇదే నిదర్శనం. జగన్ తలవంచని వైఖరి పెద్దలనందరినీ కోపానికి గురిచేసింది. కానీ వైయస్ జగన్ కి ప్రజల సానుభూతి, కొందరి రాజకీయనాయకుల, వైయస్ ఆర్ విధేయుల మద్దతు లభించటమే కాకుండా జగన్ పార్టీ పెడితే మేము దానికే మద్దతిస్తామని అన్నవారున్నారు. అయినా ఆ సమయంలో తను చేస్తున్న ఓదార్పు యాత్రలో జగన్ ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు.
అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో మార్పులు జరిగాయి. జగన్ కొత్త పార్టీ పెట్టటం, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోటీ చేసి ఉపఎన్నకల్లో అత్యధిక మెజారిటీతో గెలవటం జరిగింది.
ఈ వైఖరి జగన్ సిబిఐ ఆరోపణలను ఎదుర్కుంటున్న సమయంలో కూడా 2011లో ఆగస్ట్ 15 నుంచి కృష్ణా జిల్లాలో చేసిన ఓదార్పు యాత్ర వరకూ అలాగే కొనసాగటం విశేషం. ఒక పక్క నమ్ముకున్న పార్టీ, తండ్రి ఎంతో సేవ చేసిన పార్టీ తనను దూరంగా ఉంచటం, ఇతర పార్టీలన్నీఏకమై నిందించటం, మరో పక్క అసలు ఆర్థికంగా చితికిపోయేట్టుగా చేస్తే ఏ కార్యక్రమమూ ఉండదు కదా అన్న ఆలోచనలతో ఆరోపణలు చేసి చివరకు కేసులు పెట్టటం వరకూ వచ్చినా జగన్ చలించకుండా తన కార్యకలాపాలను కొనసాగించటం విశేషం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more