Chiranjeevi

Chiranjeevi.GIF

Posted: 12/17/2011 09:46 AM IST
Chiranjeevi

చిరంజీవికి కాలం కలిసి రావడం లేదా ? లేక ఆయనకు ఏమైనా శకుతలు అడ్డుపడుతున్నాయా ? లేక కాంగ్రెస్ చిరుతో నాటకం ఆడుతుందా ? లేక రాజకీయ లబ్ది కోసం అతని పదవికి రాష్ట్రంలో ఎవరైనా అడ్డుపడుత్నారా ? వీటన్నింటికి కారణాలు వెతకడం కష్టమేం కాదు. కానీ ఎన్నో రోజుల  నుండి కళ్ళు కాయలు కాసేలా కేంద్రంలో పదవి కోసం పిట్ట ఎదురు చూస్తున్నట్లు చూస్తున్న చిరంజీవికి నిన్న మొన్నటి వరకు ఊరించిన పదవి మళ్ళీ దూరం అయ్యింది.

ఈ నెల 18న కేంద్రమంత్రి వర్గ విస్తరణ జరుగుతుండటంలో ఈ సారి చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం విపరీతంగా జరిగింది. కానీ ఆ వార్తల్లో నిజం తేదని తేలిపోయింది. దీంతో చిరుగుండె పై మరోసారి దెబ్బపడ్డట్లయింది. ఈ సారికి కేంద్రంలో అజిత్ సింగ్ తోనే సరిపెట్టాలని సోనియాగాంధీ భావించడం, చిరంజీవికి ఇప్పట్లో కేంద్రంలో చిరంజీవికి ఎలాంటి పదవి ఇవ్వద్దని కిరణ్ కుమార్ ఒత్తిడి తేవడంతో మళ్ళీ ఈసారి కూడా చిరుకు పదవి అందని దాక్షే అయింది. దీంతో చిరంజీవి మరి కొంత కాలం ఢిల్లీ వైపు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఈనెల 18న జరిగే కేంద్రమంత్రివర్గ అతి స్వల్ప విస్తరణలో అజిత్‌సింగ్‌ ఒక్కరికే అవకాశం లభించనుంది. యుపి ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పు చోటు చేసుకోనుంది. అయితే, చిరంజీవికి రాష్ట్రం నుంచి అవకాశం వస్తుందని భావించినప్పటికీ ఆయనకు ఈసారి నిరాశ తప్పేలా లేదు. మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయన సీటు ఇచ్చి, కేంద్రబడ్జెట్‌ సమావేశాల తర్వాత జరిగే విర్తరణలో స్థానం కల్పిస్తారని, ఆ మేరకు హామీ కూడా లభించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా చిరుకి మేడమ్ మళ్ళీ మళ్ళీ సారి చెప్పిందనేది మాత్రం నిజం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu says he is not against telangana
Jagan team  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles