Chandrababu says he is not against telangana

Chandrababu says he is not against Telangana. chandrababu naidu, telugudesam, mahaboobnagar, telangana

Chandrababu says he is not against Telangana. chandrababu naidu, telugudesam, mahaboobnagar, telangana

Chandrababu is not against Telangana.gif

Posted: 12/17/2011 11:07 AM IST
Chandrababu says he is not against telangana

Chandrababuటీడీపీ అధ్యక్షుడు, నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అంశం పై ఇన్ని రోజులు రెండు కళ్ళ సిద్ధాంతం అని చెబుతూ ఉండేవాడు. దీంతో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు తెలంగాణ లో తిరగలేని పరిస్థితి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో వారు అధినాయకునిపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరికొందరైతే ఎదిరించి పార్టీనుండి బయటికి పోయి నాగం లాంటి వాళ్ళు ఆయన పై దుమ్మెత్తి పోసిన సందర్బాలు ఉన్నాయి. దీంతో పార్టీ తెలంగాణలో బలహీన పడుతుందని భావించిన చంద్రబాబు తన రెండు కళ్ళ సిద్దాంతంతో కాస్త మార్పులు చేసుకున్నాడు.

ఎలాగైనా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆయన చేపట్టిన ‘రైతు పోరు బాట’ను తెలంగాణ జిల్లాల్లో కూడా చేస్తున్నాడు. ఈ యాత్రలో ఆయనకు చిన్న చిన్న ఆటుపోట్లు ఎదురైనా యాత్రలో దూసుకుపోతున్నాడు. తెలంగాణ ప్రజలను మరింత ఆకట్టుకోవడానికి ఆయన ‘‘నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు’’ అని తమ నాయకులకు హితబోత చేస్తున్నాడు. "తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత... అధికారం కేంద్రానికే ఉన్నాయి. తక్షణం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మనం కేంద్రాన్ని పదే పదే కోరాం. మనం అధికారంలో లేం. నిర్ణయం తీసుకొనే శక్తి మన చేతిలో లేదు. తెలంగాణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయిస్తే మనం ఆపగలుగుతామా? కాంగ్రెస్‌తో కుమ్మక్కైన శక్తులే వాస్తవాలను దాచిపెట్టి మనను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలకు అదే చెప్పండి'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు సూచించారు. ‘‘నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు’’. అనేకసార్లు ఈ విషయం బహిరంగంగానే చెప్పాను. గత ఎన్నికల ముందు తెలంగాణకు అనుకూలంగా మనం నిర్ణయం తీసుకొన్నాం. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చాం. తెలంగాణకు వ్యతిరేకమైతే ఈ పని ఎందుకు చేస్తాం? ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పండి'' అని ఆయన కోరారు. కానీ బాబు చెప్పే మాటలు కల్లిబొల్లి మాటలు అని, అవి తెలంగాణ ప్రజలు నమ్మరని నాయకులకు తెలిసినా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు టీడీపీ నాయకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Injurious smoking growing in the society
Chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles