A happy married life

Telugu News, Telugu Cinema News, Andhra News, Telugu Cinema Videos, Andhra Political News, Telugu Cinema Actress Photos, Hot Gossips, Tollywood Gossips and Tv Shows

Is it possible to live a happy life without a relationship or sex.

A Happy Married Life.GIF

Posted: 12/12/2011 02:37 PM IST
A happy married life

Husbend_wifeసుఖ సంసారానికి శృంగారం ఆవశ్యకమే అయి నప్పటికీ ఔదార్యం, పెద్దమనసుతో ప్రవర్తించటం వంటి గుణాల వల్ల, జంటల్లో సంబంధాలు మరింత గాఢంగా పెనవే సుకుంటాయని తాజాగా జరిపిన ఒక అధ్యయనం వెల్లడిం చింది. ప్రముఖ పరిశోధకుడు బ్రాడ్‌ఫోర్డ్‌ విలికాక్స్‌ బృందం తన పరిశోధనలో భాగంగా 1400 మంది జంటలపై అధ్య యనం జరిపారు. పరస్పరం, బహుమతులు ఇచ్చుకోవటం, ప్రేమతో ఔదార్యాన్ని ప్రకటించటం వంటి అంశాలు వారి వివాహ బంధాన్ని ఐదు రెట్లు ఎక్కువగా బలోపేతం చేస్తున్నా యని పేర్కొన్నారు.

అయితే పెళ్ళయిన జంటల్లో శృంగార జీవితం వారి సుఖసంతోషాలకు అతిపెద్ద కారణంగా అధ్యయనంలో తేలింది.అదేవిధంగా పడకటింట్లో ప్రదర్శించే ఔదార్యం కూడా జంటల మధ్య ప్రేమ బంధానికి ప్రధాన కారణంగా ఉందని పరిశోధకులు తెలిపా రు. ఒకరి పట్ల ఒకరు ఔదార్యం ప్రదర్శించటమనేది చాలా తేలికైనది. ఉదాహరణకు కాఫీ తయారు చేయటం, పుష్పాలు ఇచ్చిపుచ్చుకోవటం, తన ప్రేయసికి లేదా ప్రియుడికి కావలసినది ఇవ్వటం ఈ చర్యల వల్ల ఒకరిని మరొకరు తెలుసుకునేలా చేస్తుందంటున్నారు. అయితే శృంగారం మాత్రం వివాహ బందం సజావుగా సాగటంలో అత్యంత ప్రధాన పాత్రగా ఉందంటున్నారు. సాధారణ లేదా మొక్కుబడిగా శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే మంచి శృంగారం జీవితం తమకు అత్యధిక సంతోష జీవితాన్నిస్తు న్నదని చెప్పిన పురుషులు, స్ర్తీలు 10 నుంచి 13 రెట్లు ఎక్కువ మంది ఉన్నారు. మొత్తానికి అధ్యయన ఫలితాలను క్రోడీకరిస్తే... సుఖమయ వివాహ బంధానికి తొలుత శృంగారం, తరువాత, అంకిత భావం, ఔదార్యం, తమ సంతానం పట్ల సకారాత్మక ఆలోచన విధానాలు ప్రధానమైనవని అధ్యయనం పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Happy birthday superstar rajanikant
Party names transgender as cm candidate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles