Soon tv that can be carried in pocket

Soon TV that can be carried in pocket, Quantum, the Italian company leader in multimedia, handheld DVB-H devices for the mobile entertainment market, QD TV, British scientists ,

Soon TV that can be carried in pocket, Quantum, the Italian company leader in multimedia handheld DVB-H devices for the mobile entertainment market,

Quantum Pocket TV.GIF

Posted: 12/12/2011 01:59 PM IST
Soon tv that can be carried in pocket

Soon TV that can be carried in pocket

మడిచి జేబులో పెట్టేసుకునే టెలివిజన్‌ లు మరో రెండు మూడేళ్ళలో మార్కెట్‌లోనికి రా నున్నాయి. ఇప్పటివరకు 3డీ టీవీలే అత్యంత అధునాతమైనవిగా గుర్తింపుపొందగా తాజాగా, వాటిని మరిపించే క్వాంటం డాట్‌(క్యూడీ) టీవీల ను బ్రిటన్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ శాస్తవ్రే త్తలు అభివృద్ధి చేశారు. వీరు కొత్త రకానికి చెం దిన కాంతిని వెదజల్లే క్రిస్టల్స్‌ (స్పటికాలు)ను అభి వృద్ధి చేశారు. వాటినే క్వాంటం డాట్స్‌గా పిలుస్తా రు. అతిపలుచని టెలివిజన్‌లను తయారుచేయటానికి వీటిని ఉపయోగిస్తారు. అతి సూక్ష్మ మైన ఈ క్రిస్టల్స్‌ పరిమాణం, మానవ వెంట్రుకలో లక్షవ వంతు ఉంటుంది. వీటిని మెత్తని ప్లాస్టిక్‌ షీట్లపై ముద్రించి పేపరు వలే ఉండే స్క్రీన్‌లను పలు సైజుల్లో తయారుచేయవచ్చని శాస్తవ్రేత్తలు నిరూపించారు. 

అయితే ప్రస్తుతానికి తొలి క్యూడీ టీవీ మనకు అందుబాటులో ఉన్న ఫ్లాట్‌ స్క్రీన్‌ టీవీల వలే ఉంటుందని వారు ఆశిస్తున్నారు. ఈ టీవీల్లో రంగులు మరింత స్పష్టంగా కన్పిస్తాయి. పలుచని స్క్రీన్లతో కూడిన ఈ టీవీలు వచ్చే సంవత్సరం చివరి నాటికి మార్కెట్లోకి రావచ్చు. అయితే మలచడానికి వీలైన టీవీలు మాత్రం మార్కెట్లోకి రావటానికి మరో మూడేళ్లు పడుతుందని శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. ఈ శాస్తవ్రేత్తల పరిశోధనల ఫలితా లను ఉపయోగించి నానొకొ కంపెనీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నది. ‘క్వాంటమ్‌ డా ట్‌ టీవీలు ఫ్లాట్‌ స్క్రీన్‌ టెలివిజన్లలో వచ్చే నవతరం టీవీలు, క్వాంటం డాట్లను వాల్‌పేపర్లు, కర్లైన్లు వంటి వాటిపై ముద్రించి డిజిటల్‌ ప్రేమ్‌లతో కూడిన చిత్రాన్ని ఆవిష్కరించవచ్చని’ నానోకొ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి మైకేల్‌ ఎడిల్‌మాన్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Party names transgender as cm candidate
Black cat gets owner of 82 crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles