హోం మంత్రి చిదంబరం మీద ఆరోపణ చేస్తూ ఢిల్లీ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా సాక్షిగా హాజరు కావటానికి అనుమతి లభించింది. 2 జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరం ప్రమేయమున్నదని ఆరోపిస్తూ, అందుకు చిదంబరం ప్రధాన మంత్రికి రాసిన రహస్య లేఖను బహిర్గతం చేస్తూ, దానిమీద కోర్టులో కేసు వేసిన సుబ్రహ్మణ స్వామి డిసెంబరు 17 న సాక్షిగా హాజరు కావలసిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశించింది.
2 జి నియామకాలను వేలం పద్ధతి ద్వారా చేసివుండాల్సిందని, అయితే అది కాస్తా అయిపోయిన సందర్భంగా ఆ విషయాన్ని అంతటితో మూసివెయ్యాలని ఆర్థిక శాఖ ద్వారా చిదంబరం ప్రధాన మంత్రికి రాసిన లేఖ సమాచార హక్కు చట్టం కింద చేజిక్కించుకున్న సుబ్రహ్మణ్య స్వామి దాని ఆధారంతో కోర్ట్ లో ఫిర్యాదు చెయ్యగా, ఆ లేఖ బహిర్గతం కావటం ప్రస్తుత ఆర్థిక శాఖా మాత్యులు ప్రణబ్ ముఖర్జీ, హోం మంత్రి చిదంబరం మధ్య అంతకు ముందునుంచే ఉన్న అగాధాన్ని ఇంకా పెంచివేసింది. అయితే ప్రధాన మంత్రి ముందుకు వచ్చి వారిద్దరి మధ్యా సయోధ్యకు బాట వెయ్యటమే కాకుండా, చిదంబరం పట్ల తన సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రకటించటంతో అప్పట్లో అంతర్గత పోరుకి తెరదించటమైంది కానీ చట్టపరిధిలో ఇంకా ఆ అంశం నానుతూనేవుంది. దానికి తోడు ప్రధాన నిందితుడు ఎ. రాజా కూడా పూర్తిగా తన తప్పే కాదని, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరానికి అన్నీ తెలిసే జరిగాయని చెప్తూ ధీమాగా ఉంటూ బెయిల్ కోసం కూడా ప్రయత్నించకపోవటం విశేషం.
శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more