పశ్చిమ బెంగాల్ లో జంగల్ మహల్ లో మావోయిస్ట్ ల కోసం చిక్కు దువ్వెన గాలింపు మొదలైంది. నిన్న రాత్రి నుంచీ జరుగుతున్న ఈ గాలింపు చర్యలో ఇప్పటికే కొందరు మావోయస్ట్ లు పోలీసులకు చిక్కారు. కిషన్ జీ తమ్ముడు మల్లోజుల వేణుగోపాల్ కోసం ఇంకా గాలిస్తూనేవున్నారు. నిఘా వర్గాల ద్వారా మావోయిస్ట్ ల ప్రణాళిక బహిర్గతం కావటంతో ఈ వేట మొదలైందని సమాచారం. రైల్వే స్టేషన్ ని పేల్చి వేయటానికి మావోయిస్ట్ లు వ్యూహాలు పన్నుతున్నట్టుగా సమాచారం అందటంతో ప్రభుత్వం ఈ గాలింపు చర్యలను ప్రారంభించింది.
బుధవారం హైద్రాబాద్ లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.సురేశే కుమార్ సహాయ కార్యదర్శి వి రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు జెల్లా లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కిషన్ జీ ఎన్ కౌంటర్ ఒట్టి భూటకమని, నిజానికి అది హత్యనని, ఈ విషయంలో హైకోర్ట్ లేదా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఎపిసిఎల్ సి అభిప్రాయపడుతోంది. ఎపిసిఎల్ సి తోపాటు బంధుముక్తి, ఏపీడిఆర్, పియుడిఆర్ బృందాలు కిషన్ జీ ని కాల్చి చంపిన ప్రదేశాన్ని సందర్శించామని, దగ్గర్నుంచే కాల్చి చంపి ఎన్ కౌంటర్ అని నాటకాలాడుతున్నారని, అందుకు అక్కడ నివసించేవారే ప్రత్యక్షసాక్షులని వారు అన్నారు.
శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more