Censorship in india

censorship in india, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

censorship in india, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

censor1.gif

Posted: 12/07/2011 06:16 PM IST
Censorship in india

cinemaసినిమాలను చూసేవారి దృష్టిని ఆకర్షించి, వారి ఙాపకాలలో ఎక్కవు కాలం నిలిచివుండి, వారి ఆలోచనలను, కార్యకలాపాలను ప్రభావితం చేసే శక్తి ప్రింట్ మీడియా కంటే సినిమాలకే ఎక్కువగా ఉండటం వలన, సినిమాలను సెన్సార్ చెయ్యటం చాలా అవసరమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.  వెలుతురును బాగా తగ్గించి చీకటిగా చేసిన ప్రదర్శనశాలల్లో శబ్దం, దృశ్యాల మేలుకలయికలో సంభాషణలు, చర్యలను చూపిస్తూ, సినిమాలను చూసేవారి మస్తిష్కంలో ఇతర ఆలోచనలు లేకుండా చెయ్యటం వలన వారిలో భావోద్రేకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మంచి గుణాలకు ఎంత శక్తివంతంగా ప్రేరేపించగలదో, చెడు ప్రవర్తనకూ ప్రేరేపించగలదని, అందువలన సినిమాలను వినోదాన్ని కలిగించే ఇతర మాధ్యమాలతో పోల్చగూడదని, దాని కారణంగా ముందు జాగ్రత్తే ముఖ్యం కాబట్టి సెన్సార్ చెయ్యటం ఆశించదగ్గదే కాకుండా అనుసరణీయమని, సుప్రీం కోర్టు ప్రకటించింది. 

ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ నియంత్రణలో పని చేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బహిరంగంగా ప్రదర్శించే సినిమాలు, టివి షోలు, ప్రకటనలు, ప్రచార సాధనాలను పరిశీలించి, వాటిని వర్గీకరించి సెన్సార్ చెయ్యటానికి 1952లో తీసుకునివచ్చిన సినిమాటోగ్రాఫ్ చట్టం అధికారాలు కట్టబెట్టింది.   ఈ చట్టం ప్రకారం ఈ బోర్డు సర్టిఫికేట్ తోనే సినిమాలను ప్రదర్శించటం చట్టబద్ధమవుతుంది.

సినిమాలనేవి భారతదేశంలో మొట్టమొదటిగా 1896లో వచ్చాయి.    బొంబాయి లోని వాట్సన్ హోటల్లో మొదటి ప్రదర్శన చిత్ర ప్రదర్శన జరిగింది.  1909 లో ఇంగ్లాండ్ లో మొదటిసారిగా సినిమాటోగ్రాఫే చట్టం వచ్చింది.  కానీ ఆ చట్టం కేవలం భద్రతా ఏర్పాట్ల మీదనే దృష్టి సారించింది.    ఆ సమయంలో వాడకంలో ఉన్న ఫిల్మ్ సెల్యూలోజ్ బేస్ తో తయారవటం వలన అగ్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఎక్కువగానూ త్వరితంగానూ ఉండటంతో ఆ చట్టంలో అగ్ని ప్రమాదాలనుంచి రక్షించే ఏర్పాట్ల విషయంలోనే శ్రద్ధ చూపించిందా చట్టం. 

దాదాసాహెబ్ ఫాల్కే తీసిన మొదటి భారతీయ చిత్రం, రాజా హరిశ్చంద్ర 1913లో నిర్మించబడింది.  ఆ తర్వాత 1920లో దేశంలోని పలు కేంద్రాల్లో సెన్సార్ బోర్డ్ లను స్థాపించటం జరిగింది.  అవి బొంబాయి, మద్రాసు, కలకత్తా, లాహోర్, రంగూన్ లలో వెలిసాయి.  అవి స్వతంత్ర ప్రతిపత్తితో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నడిచేవి.  వాటి స్థానంలో 1952లో రూపొందించిన సినిమాటోగ్రఫీ చట్టం వలన బొంబాయిలో స్థాపించిన సెన్సార్ బోర్డు కిందికి సెన్సర్ చేసే అధికారాలు వచ్చాయి.  1983లో తిరిగి ఈ చట్టంలో సవరణలు జరిగి, సెన్సార్ బోర్డ్ కాస్తా ప్రస్తుతం అమలులో ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్ సి) కిందికి వచ్చింది. 

ముంబై ప్రధాన కార్యాలయంగా 9 ప్రాదేశిక కార్యాలయాలతో నిర్వహించబడుతున్న ఈ సిబిఎఫ్ సి కి ఒక చైర్ పర్సన్, కొందరు సభ్యులు ఉంటారు.  వీరందరినీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.  ప్రస్తుతం ప్రఖ్యాత భరత నాట్యకోవిదురాలు లీలా శాంసన్ ఈ బోర్డుకి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.  అంతకు ముందు ప్రఖ్యాత సినీ నటి షర్మిలా టాగోర్ చైర్ పర్సన్ గా ఉండేవారు.  ఈ బోర్డ్ లో వివిధ రంగాలలో ప్రముఖులను రెండు సంవత్సరాల కాల పరిమితి వరకూ పనిచెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.  ప్రస్తుతం చైర్ పర్సన్ గా పనిచేస్తున్న లీలా శాంసన్ 26 వ చైర్ పర్సన్.  అంతకు ముందు చైర్ పర్సన్ గా వ్యవహరించినవారిలో సినీ ప్రముఖులు, ఆశా పరేఖ్, హృషీకేశ్ ముఖర్జీ, శక్తి సామంత, విజయానంద్, అనుపమ్ ఖేర్ ఉన్నారు. 

సిబిఎఫ్ సి ప్రాంతీయ కార్యాలయాలు, ముంబై, కోలకతా, చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం, హైద్రాబాద్, న్యూఢిల్లీ, కటక్, గౌవాహాతీ లలో ఉన్నాయి. 

సిబిఎఫి సి ఇచ్చే సర్టిఫికేట్లు ఈ విధంగా ఉంటాయి.

censor-certificatesU అంటే యూనివర్సల్.  ఇవి అన్ని వయస్కులవారూ చూడదగినవి.  చిన్నపిల్లలు చూడగూడని దృశ్యాలేమీ వీటిలో ఉండవు.  

U/A అంటే, తల్లిదండ్రుల సమక్షంలో పేరెంటల్ గైడెన్స్ తో చూడదగినవి.  ఈ సినిమాలు 12 సంవత్సరాల లోపు పిల్లలు చూడగూడదు.  అందువలన వారి తల్లిదండ్రులు, సంరక్షకులతోపాటు చూడవచ్చు.

A  అంటే, పెద్దలకు మాత్రమే.  ఇవి కేవలం 18 సంవత్సరాలు నిండినవారికి మాత్రమే అనుమతించదగిన సినిమాలు.  సినిమాలు సిడిలు కానీ మరే రూపంలో కానీ లేదా గేమ్ గా కానీ ఉన్నట్టయితే వాటిని 18 సంవత్సరాల లోపువారు కొనుగోలు చెయ్యగూడదు.  సినిమా హాల్లోనూ చూడగూడదు.  ఇందులో వాడిన భాషమీద కానీ, దృశ్యాలలో ఉపయోగించిన డ్రగ్స్, హింస, శృంగారాలకు సంబంధించిన విషయాల ప్రస్తావన కానీ, శృంగార క్రీడల విషయంలో కానీ ఎటువంటి నిబంధనలూ లేవు. 

S అంటే, కేవలం కొన్ని వర్గాలు మాత్రమే చూడదగినవి.  ఉదాహరణకు డాక్టర్లు.  అంతకు ముందు లేని  U/A, S సర్టిఫికేట్లను 1983 లో ప్రవేశపెట్టారు. 

భారతదేశంలో 1959 నుంచి 2005 వరకు దాదాపూ 11 సినిమాలను ప్రదర్శనకి అర్హతలేనివిగా గుర్తించి బహిష్కరించటం జరిగింది.  ఆంధ్రప్రదేశ్ లో 2006 లో ఇంగ్లీషు సినిమా డా వెన్సీ కోడ్ ను, తాజాగా 2011 లో హిందీ సినిమా ఆరక్షణ్ ను ప్రదర్శనకు అనర్హమని బహిష్కరించటం జరిగింది. 

     1959 లో నీల్ ఆకాశ్ కే నీచే ని రెండు సంవత్సరాల కాలం బహిష్కరించారు. ఇందులో చైనా నుంచి వలస వచ్చిన కూలీల గురించి ఉంది. 1963లో వచ్చిన నైన్ అవర్స్ టు రామా అనే చిత్రంలో గాంధీజీని హత్య చేసిన నథూ రామ్ గాడ్ సే మనోభావాల మీద చిత్రీకరించబడింది. 1970 లో కిస్సా కుర్సీకా అనే చిత్రం సమకాలీన రాజకీయాల గురించి విమర్శనాత్మకంగా ఉండటంతో బహిష్కరించటమే కాకుండా ఆ ఫిల్మ్ మిగలకుండా కాల్చిపడేసారని కూడా విమర్శలు వచ్చాయి. 1971 లో బహిష్కరించబడిన సిక్కిం అనే సినిమాలో సిక్కింని స్వతంత్ర రాజ్యంగా చూపించటం జరిగింది. దీని మీద 2010లో బహిష్కరణను ఎత్తివేసారు. 1984 లో బహిష్కరించిన ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్ అనే సినిమాలో ఇండియన్ జాతీయుల మీద విమర్శనాత్మకంగా ఉంది. 1991లో 15 సంవత్సరాల కాలం వరకూ బహిష్కరించిన కుత్రపతిరిక్కై అనే సినిమాలో రాజీవ్ గాంధీని హత్యచేసిన ఎల్టిటిఇ పక్షంలో నిర్మించబడింది. 1996లో వచ్చిన కామసూత్ర సినిమాలో స్వలింగ సంపర్కం ఉండటం వలన బహిష్కరించబడింది. ఆ దృశ్యాలను తీసేసిన తర్వాత మిగిలిన ముక్కలు లభ్యమౌతాయి. 1996లో ఫైర్ అనే సినిమా ప్రదర్శనను కొందరు హిందూ మతవాదులు అడ్డుకుని గందరగోళాన్ని సృష్టించారు. ఈ సినిమాను కొన్నాళ్ళ తర్వాత ప్రదర్శించటం జరిగింది. 2003లో వచ్చిన పాంచ్ అనే చిత్రంలో విపరీతమైన హింసాత్మక దృశ్యాలు, శృంగార దృశ్యాలు ఉండటమే కాకుండా అందులో ఎటువంటి సందేశమూ లేకపోవటంతో దాన్ని బహిష్కరించారు. 2005 లో పైర్ తీసిన వాళ్ళే మళ్ళీ వాటర్ అనే సినిమాలో పవిత్రమైన గంగానదిగా భావించే హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉండటంతో బహిష్కరించబడింది. అదే సంవత్సరం బందిపోటు రాణి యదార్థ గాధను చిత్రకథాంశంగా మలిచి శేఖర్ కపూర్ నిర్మించిన బాండిట్ క్వీన్ చిత్రంలో శృంగారాతిశయం ఎక్కువగా ఉండటంతో అది కూడా బహిష్కరణకు గురైంది. 2006 లో డా విన్సీ కోడ్ క్రిస్టియన్ల నమ్మకాలను కించపరిచేదిగా ఉండటంతో బహిష్కరించబడింది. 2011 లో ఆరక్షణ్ సినిమా సున్నితమైన రిజర్వేషన్ల అంశం మీద ఉండటంతో దాన్ని బహిష్కరించారు.


-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pak president may step down
Minister pithani pa caught red handed in sex scandal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles