Pak president may step down

asif ali zardari, pakistan, islamabad, scandal, medical tests, dubai, treatment

Asif Ali Zardari has gone to Dubai for medical tests, his spokesman said today as speculation mounted in Pakistan that the President may step down, apparently under intense army pressure over the 'memogate' scandal.

Pak President may step down.GIF

Posted: 12/08/2011 09:59 AM IST
Pak president may step down

Asif-Ali-Zardari

పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్ధారీ (56) గుండె పోటుకు గురయ్యారు. ఆయనను హుటావుటిన దుబాయ్ లోని ఆస్పత్రిలో చేర్చారని సమాచారం. ఇంతకు ముందు నుండే ఆయనకు గుండె జబ్బు లక్షణాలు మళ్ళీ కనిపించడంతో అధ్యక్షుడు జర్ధారీ చికిత్స నిమిత్తం వెళ్ళారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే అనారోగ్య కారణాలతో జర్ధారీ పదవి నుండి వైదొలగనున్నారన్న వార్తలు వెలువడ్డాయి. వాస్తవానికి సైనిక ధళాధిపతులకు, జర్థారీకి మధ్య ప్రచ్చన్నయుద్ధం సాగుతుండటం, ఆయన్ని పదవి నుండి దింపాలని సైన్యం ప్రయత్నిస్తుందోన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ను ప్రత్యేకంగా సమావేశపర్చాలని జర్ధారీ నిర్ణయించారు. కానీ ఆయన అకస్మాత్తుగా దుబాయ్ వెళ్లడంతో అనారోగ్య కారణంగా పదవి నుండి వైదొలగనున్నారని అమెరికాకు చెందిన ఓ పత్రిక వెల్లడించింది.
ప్రధాని రాజీనామా చేయడానికి మెమో గేట్ కారణం అని  అంటున్నారు. మేలో ఆల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ హత్యానంతరం, తమ సైన్యం తిరుగుబాటు చేయవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తూ, అమెరికా సాయాన్ని అభ్యర్థిస్తూ ఆ దేశంలో పాక్ రాయభారిగా ఉన్న హుసేన్ హకానీ వర్తమానం (మెమో) పంపినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీని వెనుక జర్థారీ ప్రమేయముందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతాన్ని మెమోగేట్ వివాదంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చిక్కుకొని హుస్సేన్ ఇప్పటికే రాజీనామా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Agan bought mlas with money
Censorship in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles