Victory to elected leaders

victory to elected leaders, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

victory to elected leaders, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

victory-to-rulers1.gif

Posted: 11/26/2011 12:52 PM IST
Victory to elected leaders

""జయము జయము మహారాజులకు. ఏలినవారికి మగసంతానం కలిగింది"

""జయము జయము మహారాజులకు. మహారాణీ వారు, పుట్టిన రాకుమారుడూ ఆరోగ్యంగా ఉన్నారు."

""జయము జయము మహారాజులకు. మహారాణీ వారు శుభ ఘడియల్లో ప్రసవించారు. పుట్టిన బిడ్డ అతి పరాక్రమవంతులు, పరిపాలనా దక్షులూ అవుతారని, రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించటమే కాక, రాజ్యాన్ని విస్తరింపజేస్తారని, వంశానికి ఘనకీర్తిని తెస్తారని జ్యోతిష వాణి."

ఈ వార్తలను మోసుకొచ్చిన వార్తాహరులంతా రాజుగారి చేతికందిన ధనంతో సత్కరించబడ్డారు. క్షత్రియుడి ధ్యాసంతా విజయం మీదనే ఉండాలి. వినేవన్నీ జయజయధ్వానాలే కావాలి. అందరూ కోరుకునేది అదే, రాజుగారికి జయం కలగాలని. దేవుడి కంటే కూడా రాజ్యమేలే రాజు ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. పాపాలకు శిక్ష దేవుడి సమక్షంలో ఎప్పుడు పడుతుందో కానీ ముందుగా రాజుగారే శిక్ష విధిస్తారు కాబట్టి, కట్టెదురుగా కనిపించే పాలకుడే ప్రాధాన్నాన్ని సంతరించుకోవటంతో దేవుడిని కూడా రాజ లక్షణ సంపన్నుడిగానే చూసారు. అందుకే సిరిసంపదలూ, ఆభూషణాలూ, వాహనాలు, వైభవాలు, అందరిమీదా ఆధిపత్యం, సర్వస్వతంత్రత , బహు భార్యాత్వం, ఇలాంటివన్నీ ఆపాదించారు. ఆయన ఏం చేసినా మన మంచికే నని విశ్వసించారు. రాజవంశంలో పుట్టి రాక్షస సంహారం చేసిన అవతారమూర్తిగా దేవుడిని కొనియాడారు.  లేకపోతే నిర్గుణ నిరాకార విశ్వవ్యాపక చైతన్యానికి జయాపజయాలేమిటి?

అందువలన, దేవుడికీ జయమే కలగాలని కోరుకుంటాం. "జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై దుర్గే, జై సంతోషిమా....."

మనల్ని రక్షించే ప్రతివారి జయాన్నీ మనం కోరుకుంటాం కాబట్టి, మార్గ దర్శనం చేసి ముక్తి మార్గాననడిపించే గురువుగారికి కూడా వారి ఆ పనిలో జయం కలగాలని, "జై గురుదేవా అంటాం"

రాజు కానీ, గురువు కానీ, దేవుడు కానీ ఏదో ఒకదానితో పోరాడుతుంటారు కానీ, రాజకీయనాయకులకు జై కొట్టటమెందుకనేది అర్థం కాదు. ప్రత్యర్థులు కూడా మనదేశ పౌరులే. ఇక జయాపజయాలేమున్నాయి అని అనుకుంటే పొరపాటు. అధికారం, సంపాదన కోసం పోటీచేసేవారికి ఎన్నికలు కూడా యుద్ధమే మరి. అందులో గెలుపు వారిని అందలం ఎక్కిస్తుంది, వారి చిరకాల వాంఛలను తీరుస్తుంది. గురుదేవులు, భగవంతుల విషయంలో అలా కాదు. వారి విజయం లోక కళ్యాణమవుతుంది.

పూర్వం పోర్టబుల్ టివిలు వచ్చిన కొత్తలో వాటి అసమానమైన పిక్ అప్ తో పక్కింటి విసిఆర్ సిగ్నల్స్ ని కూడా క్యాచ్ చేసేది. అలా పక్కింటివారి పుణ్యమాంటూ చాలాకాలం ఉచితంగా సినిమాలు చూసిన ఒక కుటుంబం, ఒకసారి విచారంలో మునిగిపోయింది. దానికి కారణం పక్కింటి వారు ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయారు.   వారి స్థానంలో వచ్చినవారికి విసిఆర్ లేదు!

ఇక లాభం లేదని చూసిచూసి వాళ్ళ పక్కింటి అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకో విసిఆర్ బహూకరించారు ఈ కుటుంబంవారు.  దానితో మళ్ళీ ఐదు సంవత్సరాలు ఫ్రీగా సినిమాలు చూసారు. కాకపోతే వీళ్లు కోరిన సినిమాలే ఉండకపోవచ్చు, వీరికి అనుకూలమైన సమయంలో నడవకపోవచ్చు. ఎప్పుడైనా వీళ్లు కోరినవి కూడా వస్తుండేవి. కానీ ఎక్కవగా పక్కింటివారికి ఇష్టమైన సినిమాలే వేసేవారు.

పక్కింటివాళ్ళ విసిఆర్ (వీళ్ళు బహూకరించిందే) ఎప్పుడూ చెడిపోగూడదని, వాళ్ళింట్లో కరెంటు ఎప్పుడూ పోగూడదని, ఇంట్లో వాళ్ళు గొడవపడి విసిఆర్ ప్లే చెయ్యటం మరువగూడదని మనసారా కోరుకునేవారు ఈ కుటుంబం వారు.

అధికారం చేతికిచ్చి, నాయకులకు జైజైలు కొట్టినట్టుగానే, బోలో పొరుగింటి పెద్దమనిషికీ .... జై.

శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anna group makes efforts to ensure lokpal bill pass
Chain business organisers flee to chennai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles