Cm kiran rachabanda at shadnagar

CM Kiran Rachabanda At Shadnagar. CM, Kiran Kumar Reddy, Racha Banda, Kiran Tour, ACM Tour, Congress, Congress Party, Congress Projects, Congress Schemes, Palamur District, mahaboob Nagar Dis

CM Kiran Rachabanda At Shadnagar. CM, Kiran Kumar Reddy, Racha Banda, Kiran Tour, ACM Tour, Congress, Congress Party, Congress Projects, Congress Schemes, Palamur District, mahaboob Nagar Dis

CM Kiran Rachabanda At Shadnagar.GIF

Posted: 11/26/2011 09:49 AM IST
Cm kiran rachabanda at shadnagar

kiran-kumar-reddyరాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన రచ్చబండ కార్య క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తోటి మంత్రులతో కలిసి సంవత్సర వేడుకలు జరుపుకొని తరువాత శాంతి కపోతాలు ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతుండగా ధరల పెరుగుదలకు నిరసనగా పది మంది మహిళలు ప్రసంగానికి అడ్డుతగిలారు. దీనికి ఆయన స్పందిస్తూ.....

తాను ఎవరికీ భయపడేది లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం షాద్‌నగర్ రచ్చబండ కార్యక్రమంలో అన్నారు. సిఎం మాట్లాడుతున్న సమయంలో కొందరు మహిళలు ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు కిరణ్ స్పందిస్తూ తాను ఎవరికీ భయపడనని అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు. లక్ష మంది సభలో కేవలం పదిమంది వచ్చి అడ్డుకున్నంత మాత్రాన ఏదీ ఆగదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నియోజకవర్గమనే తాను షాద్ నగర్‌లో సభ పెట్టానని చెప్పారు.

మహిళలకు వడ్డీ లేని రుణాలు జనవరి నుండి అందించేందుకు ఈ రోజు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి తీసుకున్నానని చెప్పారు. అవి కూడా నేరుగా వారి వారి అకౌంట్లలో పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో మూడేళ్లలో 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. చదువుకున్న యువతకు నైపుణ్యాలు కొరవడం వల్ల నిరుద్యోగులుగా మిగులుతున్నారని మరో పక్క పరిశ్రమలలో నిపుణులైన వ్యక్తులు దొరక్క ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయన్నారు.

ఈ రెండింటి మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఉద్యోగాలు ఉన్న రంగాలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించే కృషి జరుగుతోందన్నారు. నిత్యావసర ధరలు నియంత్రించేందుకు త్వరలోనే ఓ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రంలో పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి మాట నిలుపుకుంటామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi get central minister
Bad time for politicians  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles